ఆ రేంజ్ రెమ్యూనరేషన్ హీరోలకేనా?.. ఆయనతో ఇంకో పది సినిమాల్లో నటిస్తా.. తమన్నా కామెంట్స్
హీరో, హీరోయిన్ల రెమ్యూనరేషన్ విషయంలో ఎప్పుడూ వివాదాంరేగుతూనే ఉంటుంది. సినిమాలో తాము కూడా హీరోలతో పాటు సరిసమానంగా కష్టపడతామని అలాంటప్పుడు తమకెందుకు రెమ్యూనరేషన్ ఆ స్థాయిలో ఉండదని ఇదివరకే ప్రశ్నలు లేవనెత్తారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ రకమైన వ్యతిరేక పవనాలు వీస్తుంటాయి. దీపికా, ప్రియాంక, కత్రినా వంటి స్టార్ హీరోయిన్స్ డిమాండ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక దక్షిణాదిన నయనతార, సమంత వంటి అతి కొద్ది మందికి ఓ మోస్తరు రెమ్యూనరేషన్ ఉంటుంది. తాజాగా రెమ్యూనరేషన్ విషయంలో తనపై వస్తున్న రూమర్స్‌పై మిల్కీ బ్యూటీ తమన్నా స్పందించింది.

తాజా రవితేజ చిత్రంలో
రవితేజ-త్రినాథరావు నక్కిన కాంబోలో ఓ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో తమన్నాను తీసుకోవాలని మేకర్స్ భావించారట. అయితే అందుకు గానూ ఆమె భారీ మొత్తంలో డిమాండ్ చేసిందంటా. దాదాపు మూడు కోట్ల వరకు అడగ్గా.. నిర్మాతలు ఖంగుతిన్నారట. దీంతో తమన్నాను పక్కనబెట్టేశారని వార్తలు వినిపించాయి.

హీరోలకు ఎందుకు అడగరు..
తన రెమ్యూనరేషన్ విషయంలో వస్తున్న వార్తలపై తమన్నా స్పందిస్తూ.. ‘ఒక నటుడి మాదిరిగానే మేమూ అధిక రెమ్యూనరేషన్ తీసుకునే విధానంలో చూస్తున్న అసమానతనలను కూలగొట్టాలి. మా రెమ్యూనరేషన్ విషయంలోనే ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి? ఇవే ప్రశ్నలను హీరోల ముందు ఎందుకు వేయరు. అందరూ కలిస్తే సినీ పరిశ్రమ ఏర్పడుతుంది. మేమూ కూడా వారితో పాటు సరిసమానంగా కష్టపడుతాం.

హీరోలకు మాత్రమేనా?
ఓ సినిమా విజయవంతం కావాలంటే ఫీమేల్ లీడ్ కూడా అవసరమే. అలాంటప్పుడు.. అత్యధిక వేతనం పొందుతున్న నటి అనే ట్యాగ్‌ను పొందటంలో తప్పేముంది. అది కేవలం హీరోలకు మాత్రమే వర్తిస్తుందా? నూతన దశాబ్దంలోనూ ఆలోచనాధోరణి మారదా.

అవన్నీ ఊహాజనితమే..
నాకు వ్యతిరేకంగా నిరంతరం వస్తున్న ఈ వార్తలు కేవలం ఊహాజనితమైనవే. అందులో ఏ మాత్రం నిజం లేదు. ప్రొడక్షన్ హౌస్ ఇప్పటికీ నా మేనేజ్‌మెంట్ బృందంతో టచ్‌లో ఉంది. పరిస్థితులన్నీ చక్కబడ్డాక మేము ఓ నిర్ణయం తీసుకుంటామని ఆశిస్తున్నాము.
Recommended Video

ఇంకో పది సినిమాల్లో
కరోనా వల్ల ప్రాజెక్ట్‌కుసంబంధించిన చర్చలన్నీ ఫిబ్రవరిలో నిలిపివేశాము. ఇప్పుడున్న ఈ పరిస్థితిలో షూటింగ్‌లు చేయలేము. నా చిత్ర వ్యవహారాలన్నిటిలో నేను చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాను. రవితేజతో ఉన్న సంబంధం మేరకు ఆయన సరసన నటించే అవకాశాన్ని తిరస్కరించాననే వార్తలో నిజం లేదు. ఒకవేళ ఆయన ఛాన్స్ ఇస్తే ఇంకో పది సినిమాల్లో కలిసి నటిస్తా'నని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











