For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తెగ చూస్తున్నారు: డాన్స్ రిహార్సల్స్‌ చేస్తున్న తమన్నా (వీడియోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్: ప్రముఖ తమిళ దర్శకుడు ఏ‌ఎల్ విజయ్ దర్శకత్వంలో తమన్నా ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'అభినేత్రి'. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం తమన్నా డాన్స్ ప్రాక్టీస్ చేస్తోంది. ప్రభుదేవాతో పాటు ఈ ప్రాక్టీస్ లో పాల్గొంది.

  ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా నేతృత్వంలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియో లింక్‌ను తమన్నా ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఏఎల్ విజయ్ డైరెక్షన్‌లో వస్తున్న అభినేత్రికి జీవీ ప్రకాశ్‌కుమార్ మ్యూజిక్‌నందిస్తుండగా..ప్రముఖ రచయిత కోన వెంకట్ కథనందిస్తున్నారు.

  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో తమన్నా సరసన ప్రభుదేవా జంటగా నటిస్తుండగా.. అమీ జాక్సన్ గెస్ట్ రోల్ పోషిస్తోంది.

  తమన్నా మాట్లాడుతూ.. "విజయ్‌ కథ చెప్పిన పది నిమిషాల్లో అంగీకరించాను. 'బాహుబలి' తర్వాత ప్రేక్షకులు నానుంచి కొత్తగా ఆశిస్తారు. దర్శకుడు అంచనాలకు అతీతంగా చూపించారు. మంచి నటిగా తీర్చిదిద్దారు.

  ఇప్పటివరకూ నేర్చుకున్నదంతా మర్చిపోయాను. ప్రచార చిత్రంలో నన్ను గుర్తుపట్టకపోవడం సంతోషంగా ఉంది. ఇది హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రం కాదు. ప్రభుదేవా లేకుండా 'అభినేత్రి' లేదు. హారర్‌ చిత్రమూ కాదు. ఏదోక జోనర్‌ కింద పరిగణించలేం. చిత్రం చూస్తే మీకు తెలుస్తుంది "అన్నారు.

  దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ మాట్లాడుతూ.. "హాలీవుడ్‌ రచయిత పాల్‌ లారన్‌తో కలసి 2012లో లాస్‌ ఏంజిల్స్‌లో స్క్రిప్ట్‌ రాశాను. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రమిది. కథ చెప్పిన తర్వాత ప్రభుదేవా నటిస్తారా? లేదా? అని సందేహించాను. రజనీకాంత్‌ 'చంద్రముఖి' చేశారు. నేను ఈ చిత్రం చేయనా? అన్నారు.

  ఆయన్నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని గర్వంగా చెప్పగలను. మా బృందంలో అందరూ ప్రభుదేవా అభిమానులే. తమన్నా ప్రథమార్థం కథ విన్న తర్వాత.. మిగతాది చెప్పనవసరం లేదని చిత్రం అంగీకరించింది. తను అమ్మ, అమ్మమ్మ అయిన తర్వాత కూడా గర్వంగా చెప్పుకునే చిత్రమిది" అన్నారు.

  ప్రభుదేవా మాట్లాడుతూ.. "ఈ చిత్రంలో దర్శకుడికి నేను చెసిన పెద్ద సహాయం ఏంటంటే.. ఆయన ఏం చెప్తే అది చేశాను. విజయ్‌కి సహనం, ఓర్పు చాలా ఎక్కువ. కథ నాకు బాగా తెలుసు. నాకంటే బాగా తమన్నాకు సన్నివేశాలతో సహా తెలుసు. ముంబై ఎప్పుడు వెళ్లినా దర్శకుడినవుతాను. హైదరాబాద్‌ ఎప్పుడు వచ్చినా డాన్స్‌ మాస్టర్‌ అవుతాను. "అన్నారు.

  ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్‌ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం 'అభినేత్రి'. ఏఎల్‌ విజయ్‌ దర్శకుడు. తెలుగులో ఈ చిత్రాన్ని కోన వెంకట్‌, ఎంవివి సత్యనారాయణ, శివ తుర్లపాటి, అరుణ్‌ వడ్డేపల్లి నిర్మిస్తున్నారు. తమిళ చిత్రానికి ప్రభుదేవా, గణేష్ లు నిర్మాతలు. హిందీ చిత్రానికి సోనూసూద్‌ నిర్మాత. సాజిద్‌-వాజిద్‌ ద్వయం సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

  English summary
  Tamannaah Dancing Rehearsals with Prabhudheva. After the victory of her current bilingual movie Oopiri, Tamannaah is keenly looking forward for her forthcoming trilingual movie in AL Vijay’s direction. The Telugu edition has now been named as Abhinetri.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X