తమన్నాతో డైరెక్టర్ విభేదాలు.. క్రేజీ మూవీ ఆగిపోయింది!

మిల్కి బ్యూటీ తమన్న ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరసన నా నువ్వే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం మే నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం కాకుండా మరో క్రేజీ చిత్రంలో తమన్నా నటించే అవకాశం దక్కించుకుంది. హిందీలో ఘనవిజయం సాధించిన కంగన రనౌత్ చిత్రం క్వీన్ పలు భాషల్లో రీమేక్ చేయబడుతోంది.

తెలుగు రీమేక్ లో నటించే అవకాశం తమన్నాకు దక్కింది. మంచి అవకాశం చేతికి చిక్కినట్లే చిక్కి ఆమె చేజారిపోయే పరిస్థితి ఏర్పడిందట. క్వీన్ తెలుగు రీమేక్ ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్ర దర్శకుడు నీలకంఠ తమన్నాతో విభేదాల కారణంగా తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Tamannah new movie Queen Telugu reamake on hold

కన్నడ, తమిళ భాషల్లో క్వీన్ రీమేక్ చేస్తున్న దర్శకుడు రమేష్ అరవింద్ తెలుగులో కూడా దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ ఎక్కు వ వర్క్ అవుతుండడంతో ఆయన తప్పుకున్నారు. ఆ తరువాత వచ్చిన నీలకంఠతో తమన్నాకు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏర్పడ్డాయట. దీనితో ఆయనకు క్వీన్ తెలుగు రీమేక్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. మరో డైరక్టర్ ని చిత్ర యూనిట్ తీసుకుంటుందా లేక ఏ చిత్రం పూర్తిగా ఆగిపోతుందా చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X