ఒక్క షాట్ కోసం పిలిచినా వస్తా అనేసిన తమన్నా

Recommended Video

Tamannaah Speech At Sye Raa Narasimha Reddy Success Meet

సైరా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అఖండ విజయాన్ని నమోదు చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాల వాడ నరసింహారెడ్డి పాత్రలో జీవించేశాడు. వెండితెరపై సైరాగా చిరు తన నట విశ్వరూపం చూపించాడు. అభిమానులు బ్రహ్మరథం పడుతున్న ఈ మూవీ కలెక్షన్లలో కొత్తరికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. ఇంత మంచి స్పందన వస్తుండటంతో చిత్రయూనిట్ ప్రేక్షకులకు థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తమన్నా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

లక్ష్మీ పాత్రలో తమన్నా ..

లక్ష్మీ పాత్రలో తమన్నా ..

లక్ష్మీ పాత్రలో తమన్నా నటనకు అన్ని వైపుల నుంచి మంచి స్పందన రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. థ్యాంక్యూ మీట్లో మాట్లాడుతూ.. ఈ పాత్రలో తన నటనకు ప్రత్యేకప్రశంసలు లభిస్తున్నాయని, చిరంజీవి నుంచి ఆ ప్రశంసలు రావడం తనకెంతో సంతోషమనిపించిందని తెలిపింది. తనను అవంతికి, నిహారిక అని తన రోల్స్ ను బట్టి పిలుస్తుంటారని.. అయితే ప్రస్తుతం లక్ష్మీ నరసింహా రెడ్డి అని పిలుస్తారని అది చాలని పేర్కొంది. చిరంజీవి గారెంతో సింపుల్గా ఉంటారని, ఆయనొక మెగాస్టార్ అని, ఆయన గురించి తెలుసుకోవాలంటే.. ఇంకా కొన్ని సినిమాలు చేయాలనకుంటున్నానని తెలిపింది. పక్కనే ఉన్నచిరంజీవికి కూడా.. తన కోరికను చెప్పుకుంది. మీరు తరువాత చేయబోయే సినిమాల్లో కూడా అవకాశమివ్వమని తమన్నా కోరింది.

ఒక్క షాట్ కోసం పిలిచినా వస్తా..

ఒక్క షాట్ కోసం పిలిచినా వస్తా..

సూరీ నీకు మళ్లీ మళ్లీ చెబుతున్నా.. నువ్వు ఒక్క షాట్ కోసం పిలిచినా నేను వస్తా అంటూ తమన్నా పేర్కొంది. జగపతి బాబు గారికి చెప్పినట్లు తనకు చెప్పొద్దని.. ఎంత చిన్నపాత్ర అయినా చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. నీ గురించి ఏం చెప్పాలిరా? నువు నటించడంలో గొప్పా? ప్రొడ్యూసర్ గా బెస్టా? అనేది చెప్పలేకపోతున్నా.. చరణ్ నాకు ఎప్పటి నుంచో తెలిసినందుకు నాకు ఆనందంగా ఉంది. లక్ష్మీపాత్రకు తనను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు అంటూ తెలిపింది.

అందంగా కనిపించడానికి కారణం వారే..

అందంగా కనిపించడానికి కారణం వారే..

ఈ సినిమా అంత అందంగా కనిపించడానికి కారణం.. క్యాస్టూమ్ డిజైనర్ సుష్మితా. తనతో మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని కోరకుకుంటున్నాను. ప్రతీ రోజూ తనతో కలసి పని చేయడం.. క్యాస్టూమ్స్ గురించి డిస్కషన్ చేయడం.. అదంతా ఒక అద్భుతమైన ప్రయాణమని, భవిష్యత్తులో కూడా నీతో పనిచేయాలని కోరుకుంటున్నాను. తనను అంత అందంగా చూపినంచినందుకు కెమెరెమెన్ రత్నవేలుకు ధన్యవాదాలు తెలిపింది. ఈ సినిమాకు సంగీతం అందించిన అమిత్ త్రివేదికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. సైరా పాట ఇంకా తన చెవులకు వినిపిస్తూనే ఉందని, ఈ మూవీకి అతని సంగీతం పెద్ద బలమని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X