ట్రైలర్ అదిరింది అంటున్నారు (వీడియో)
ముంబై: బాలీవుడ్ నటులు రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణెలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'తమాషా'. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నవంబర్ 27న 'తమాషా' ప్రేక్షకుల ముందుకు రానుంది.
2015 సంవత్సరంలో బాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సినిమాల్లో రణబీర్ కపూర్, దీపిక పదుకోన్ జంటగా నటిస్తున్న ‘తమాషా' ఒకటి. మాజీ లవర్స్ అయిన రణబీర్, దీపిక కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
తమాసా చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఫ్రాన్స్ లోని కోర్సికాలోని లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రణబీర్, దీపికలతో పాటు జావేద్ షేక్, నిఖిల్ భగత్, ఫరాజ్ సెర్వావియా, పూనమ్ సింగ్ తదితరులు నటిస్తున్నారు.



Click it and Unblock the Notifications











