‘రచ్చ’ యూనిట్‌కు తమిళ్ యాక్టర్ షాక్
తమిళ యాక్టర్ అజ్మల్‌ను గుర్తు పట్టారా..? అదేనండీ ఇటీవల వచ్చిన రంగం సినిమాలో నెగెటివ్ రోల్ చేశాడు. ప్రస్తుతం అజ్మల్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రచ్చలో ఓ కీలకమైన పాత్రను చేస్తున్నాడు. ఇతగాడు ఇటీవల రచ్చ షూటింగ్ సందర్భంగా యూనిట్ సభ్యులందరినీ షాక్ కు గురి చేశారు. కొంపతీసి అతనేదో చేయకూడని పని చేశాడని మాత్రం అనుకోకండే.. అసలు విషయం ఏమిటంటే...మూడు పేజీల తెలుగు డైలాగ్ ను కంఠస్థం చేసిన అజ్మల్ సింగిల్ టేక్ లో అదరగొట్టాడట. దీంతో షాక్ అయి నోరెల్లబెట్టడం యూనిట్ సభ్యుల వంతయింది.
రంగం సినిమాలోనే అజ్మల్ స్టామినా ఏమిటో మనం చూశాం. సాధారణంగా తెలుగు మాట్లాడే హీరోలే ఇన్ని పేజీల డైలాగ్ ఉన్న సీన్లను ఒకే టేక్ లో చేయడం అసాధ్యం. అలాంటి తమిళ భాష మాట్లాడే హీరో తెలుగుపై పట్టు సాధించి....సింగిల్ టేక్ లో కంప్లీట్ చేయడం షాక్ కాకుంటే మరేమిటి?. ఏమిటీ తెలుగు హీరోలను కాకుండా తమిళ వాళ్లని పొగుడుతున్నారు అనుకున్నారు. తెలుగోడయనా, తమిళోడయినా టాలెంట్ ను మెచ్చుకోకుండా ఉండలేం కదండీ..


Click it and Unblock the Notifications











