ఇంట్లోంచి వెళ్లిపోలేదు: ఆస్తి వివాదాలపై హీరో ప్రెస్‌మీట్

By Bojja Kumar

చెన్నై: ప్రముఖ తమిళ నటుడు ముత్తురామన్ కుమారుడు, ఒకప్పటి హీరో కార్తీక్ ఆస్తివాదాల గురించి గత కొంత కాలంగా మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చెన్నైయ్ పోయస్ గార్డెన్ నుండి బయటకు వచ్చారని వార్తలు వచ్చాయి. ఆస్తి వివాదాల నేపథ్యంలో తన సోదరుడు గణేశన్‌పై పోలీసులు ఫిర్యాదు కూడా చేసారు.

ఇంతకాలం తన ఆస్తి వివాదాలపై ఎప్పుడూ మీడియాతో స్వయంగా మాట్లాడని కార్తీక్ ఎట్టకేలకు నోరు విప్పారు. సోదరుడితో తనకు ఆస్తి వివాదాలు ఉన్నమాట నిజమే అన్నారు. తన వాటా ఆస్తిని దక్కించుకోవడానికి కోర్టు వెళ్లడానికి సిద్ధమే అన్నారు. తండ్రి మరణం తర్వాత వీలునామా దాచి నకిలీ వీలునామా సృష్టించారని, తన ఆస్తి తనకు దక్కకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Tamil Actor Karthik Muthuraman Press Meet

మా అమ్మ వీలునామా రాసినట్లు చూపుతున్నారు.అది ఇంగ్లీషులో ఉంది. వాస్తవానికి మా అమ్మకు ఇంగ్లీష్ రాదు. రెండు రోజుల్లో ఆస్తివివాదాన్ని పరిష్కరించుకోవడానికి గణే్ష్ ముందుకు రాకపోతే తాను కోర్టు వెళతానని తెలిపారు. తాను పోయస్ గార్డెన్ లోని ఇంటి నుండి బయటకు వెళ్లినట్లు వస్తున్న వార్తలు నిజం లేదన్నారు. తాను ఆ ఇంట్లోనే ఉంటున్నట్లు తెలిపారు.

డెరైక్టర్ భారతీరాజా 'అలైగళ్ ఓయ్‌వదిల్లై' అనే తమిళ చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయమైన కార్తీక్ తమిళంలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఘర్షణ వంటి చిత్రం ద్వారా ఇక్కడ కూడా పాపులర్ అయ్యారు. తెలుగులో ఆయనుక అభినందన చిత్రం మంచి గుర్తింపు ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన అనేక డబ్బింగ్ చిత్రాలు ఇక్కడ ఆడాయి. రీసెంట్ గా కల్యాణ్ రామ్ చిత్రం ఓం లోనూ ఆయన కీలకమైన పాత్రను పోషించారు. అలాగే ఈయన కుమారుడు గౌతం కార్తీక్ కూడా ప్రస్తుతం హీరో కొనసాగుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X