కోడి బొమ్మతో ఫస్ట్ లుక్ వదిలి క్రేజ్ (ఫొటో)

By Srikanya

చెన్నై : మానవీయ కోణం, వాస్తవిక చిత్రాలను తీయడంలో ఏఎల్‌ విజయ్‌ (అమలాపాల్ భర్త) కోలీవుడ్‌ తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. 'దైవ తిరుమగల్‌', 'మదరాసపట్టిణం', 'కిరీడం' వంటి సినిమాలతో తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఇటీవల తన శైలికి భిన్నంగా విజయ్‌తో 'తలైవా' తెరకెక్కించి పరాజయాన్ని చవిచూశారు. దీంతో మళ్లీ తన పాతమార్గంలోకే వచ్చారాయన. తాత, మనవరాలి మధ్య ఉన్న బంధం నేపథ్యంలో 'శైవం' తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని కేవలం ఓ కోడిపుంజు వేసి వదిలి, అందరినీ ఆశ్చర్యంలో పడేసాడు.

ఇందులో 'దైవతిరుమగల్‌' ఫేం బేబీ సారా నటిస్తోంది. నాజర్‌ ముఖ్యపాత్ర పోషించారు. నాజర్‌ కుమారుడు బాషా కూడా ఈ సినిమా ద్వారా పరిచయమవుతున్నారు. ఇటీవల 'శైవం' చిత్రాన్ని చూసిన రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ బ్యానరు నిర్మాత, నటుడు ఉదయనిధి.. ఈ సినిమాను విడుదల చేసేందుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు సాగుతున్నాయి. ఈ నెల 27వ తేదీన తెరపైకి తీసుకురానున్నారు.

Tamil Director A L Vijay Back To Direction With Saivam

నటి అమలాపాల్, సినీ దర్శకుడు విజయ్‌ల వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంటకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అమలాపాల్ కుటుంబీకుల కోరిక మేరకు గత 7వ తేదీన కొచ్చిలోని ఓ చర్చిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. విజయ్ కుటుంబీకుల మనోవాంఛ మేరకు చెన్నైలో హిందూసాంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు.

స్థానిక మేయర్ రామనాథన్ చెట్టియార్ మండపంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. వివాహ కార్యక్రమానికి విక్రమ్, ఆర్య, అబ్బాస్, డైరెక్టర్లు ప్రియదర్శన్, లిజీ దంపతులు, ఆర్.సుందర్‌రాజన్, పొన్‌వన్నన్, శరణ్య, మణిరత్నం, బాలా, నిర్మాతలు ఇబ్రహీం రావుదర్, ఎడిటర్ మోహన్ తదితర సినీ ప్రముఖులంతా హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X