For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాహుబలికంటే పే..ద్ద సినిమాకి జయంరవి హీరో... సుందర్.సీ జోకులేస్తున్నాడు

  |

  ఇప్పుడు బాహుబలి కంటే పెద్ద సినిమా..., పెద్ద హిట్ తమిళ దర్శకులకి ఒక అవసరం కూడా. నిన్నా మొన్నటివరకూ కోలీవుడ్ లో ఆఫర్లు ఉన్నా లేకున్నా మనోళ్ళు మాత్రం తమిళ దర్శకుడనగానీ తీసుకొచ్చి కోట్లు కుమ్మరించేసి చేతులు కట్టుకు నిలబడ్డారు. ఈ మధ్య రాజమౌళి, త్రివిక్రం, కొరటాల, మారుతీ వంటి దర్శకుల వల్ల తమిళ దర్శకులని తెలుగు ఇండస్ట్రీ లో పట్టించుకున్న నాథుడు లేడు...

  ఎప్పుడూ తమిళ దర్శకుల ఆలోచన ఒకటే... తెలుగు దర్శకులకు సినిమా తీయటం రాదు. తమిళులంత గొప్పగా వాళ్ళు ఆలోచించరూ. అదే విషయాన్ని మనోళ్ళు ఇంకా హైప్ చేసి అసలు తమిళ సినిమా కంటే తెలుగు సినిమా తక్కువ అనుకునే లా చేసారు. ఇక వాళ్ళు కూడా అలాగే ఫిక్సయ్యారు. అయితే వాళ్ళ ఉద్దేశాలనీ, ఏగోనీ చావుదెబ్బ కొట్టాడు మన రాజమౌళి. ఇక అప్పటినుంచీ తమిళ దర్శకుల లక్ష్యం ఒకటే... బాహుబలి కంటే పెద్ద, గొప్ప సినిమా తీయాలి. తెలుగు కంటే తమిళ సినిమా నే తోపు అనిపించుకోవాలి. అదే ఆలోచనతో దర్శకుడు సుందర్.సీ (ఎక్కడో విన్నట్టుందా?) ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడట దానికోసం... ఏ హీరో ముందుకు రాకపోయే సరికి ఆయన జయం రవి ని ఎంచుకున్నాడు... ఆ విశేషాలు....

  తెలుగు దర్శకులకు సినిమా తీయటం రాదు

  తెలుగు దర్శకులకు సినిమా తీయటం రాదు

  ఎప్పుడూ తమిళ దర్శకుల ఆలోచన ఒకటే... తెలుగు దర్శకులకు సినిమా తీయటం రాదు. తమిళులంత గొప్పగా వాళ్ళు ఆలోచించరూ. అదే విషయాన్ని మనోళ్ళు ఇంకా హైప్ చేసి అసలు తమిళ సినిమా కంటే తెలుగు సినిమా తక్కువ అనుకునే లా చేసారు.

  అవసరం

  అవసరం

  ఇప్పుడు బాహుబలి కంటే పెద్ద సినిమా..., పెద్ద హిట్ తమిళ దర్శకులకి ఒక అవసరం కూడా.

  పులి దెబ్బ పడింది

  పులి దెబ్బ పడింది

  ఆల్రెడీ చింబు దేవన్ ‘పులి'తో ఆ ప్రయత్నం చేసి గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు. విజయ్ హీరో గా తీసిన ఆ సినిమా కన్నీళ్ళనే మిగిల్చింది.

  బాహుబలిని మించుతుందట

  బాహుబలిని మించుతుందట

  ఇప్పుడు సీనియర్ డైరెక్టర్ సుందర్ ఆ పనిలోనే ఉన్నాడు. ఆయనైతే ‘బాహుబలి'ని మించే సినిమా తీస్తానని అంటున్నాడు. ఇండియాలో ఇప్పటిదాకా ఏ సినిమాకూ పెట్టనంత బడ్జెట్ ఈ సినిమా మీద పెట్టబోతున్నట్లు చెబుతున్నాడు.

  హీరోలే లేరు

  హీరోలే లేరు

  కాకపోతే ఈ సినిమాకు హీరో ఎవరనే విషయంలోనే చాలా తర్జన భర్జనలు నడుస్తున్నాయి. ముందు సూర్య హీరో అన్నారు. తర్వాత విజయ్ పేరు వినిపించింది. తాజాగా జయం రవి పేరు తెరమీదికి వచ్చింది.

  కథ బాహుబలి లాంటిదే

  కథ బాహుబలి లాంటిదే

  అయితే బాహుబలిని మించాలనుకుంటే కథ కూడా అలానే ఉండాలనుకున్నాడేమో... ఈ సినిమాలోనూ ఇద్దరు హీరోలుంటారట.మామూలుగానే ఒకటి నెగెటివ్ షేడ్ ఉండే హీరో పాత్ర.

  జయం రవి

  జయం రవి

  అందులో ఒక హీరో జయం రవినే అంటున్నారు. కానీ ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కే సినిమాలో జయం రవి లాంటి హీరోను పెడితే ఏమాత్రం వర్కవుట్ అవుతుందనేది సందేహం.

  వర్కౌట్ అయ్యేనా?

  వర్కౌట్ అయ్యేనా?

  జయం రవికి కొంచెం మాస్ ఇమేజ్ ఉంది కానీ.., కనీసం విశాల్ కంటే కూదా అతనేం పెద్ద ఫాలోయింగ్ ఉన్న హీరో కాదు. సూపర్ స్టార్లను పెడితే తప్ప సుందర్ అనుకుంటున్న బడ్జెట్లో సినిమా తీయడం సాధ్యం కాదు.

  చేయం పొమ్మన్నారు

  చేయం పొమ్మన్నారు

  అయితే సూర్య..,విజయ్.., కార్తీ లాంటి హీరోలు ఈ సినిమాకు నో చెప్పేశారు. చాలాకాలం గా చెప్పుకోదగ్గ హిట్ లేని సుందర్‌ను నమ్మి గంపగుత్తగా ఏడాది రెండేళ్లు డేట్లివవ్వడానికి వాళ్లు సిద్ధంగా లేరు.

  తెలుగు హీరోలనుకూడా

  తెలుగు హీరోలనుకూడా

  మరోవైపు ఈ సినిమా కోసం మన మహేష్ బాబును కూడా గట్టిగా ట్రై చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీఆ సినిమాకోసం మహేష్ కూడా అంత సుముఖంగా లేడు. స్క్రిప్టు రెడీ అయిపోయినా.. నటీనటుల సంగతే తేలక సతమతమవుతున్నాడు సుందర్. చివరికి అతను ఎవర్ని ఫైనలైజ్ చేస్తాడో చూడాలి.

  English summary
  Sundar C had recently revealed that the forthcoming film will be the costliest ever film made in India and it means the budget of the film is higher than SS Rajamouli's "Bahubali" and Rajinikanth's upcoming "2.0."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X