తగ్గిన తమిళ దర్శకుల హవా
తమిళ దర్శకులు ధరణి, ప్రభుదేవాల తాజా సినిమాలు ఫ్లాప్ కావడంతో తెలుగు నిర్మాతలు ఇక మీదట లోకల్ టాలెంట్ మీదే ఆధారపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ధరణి బంగారం, ప్రభుదేవా పౌర్ణమి బోల్తాపడిన విషయం తెలిసిందే. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన మహేష్ బాబు పోకిరి సూపర్‌హిట్ దిశగా నడుస్తుండడంతో తెలుగు దర్శకుల విలున పెరిగింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ అశోక్ ఫలితం అనుకూలంగా వస్తే పరిస్ధితి మరింత మారిపోయే అవకాశముంది. అయితే చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం స్టాలిన్‌కు దర్శకత్వం వహిస్తున్న తమిళ డైరెక్టర్ మురుగదాస్ మాత్ర ం విజయం సాధించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి. రాజమౌళి, వివి వినాయక్, పూరీ వంటి ప్రతిభావంతులైన తెలుగు దర్శకులు ఉండగా తమిళ డైరెక్టర్లను దిగుమతి చేసుకోవడం మంచిది కాదని దాసరి నారాయణ రావు వంటి వెటరన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications