తెలుగు తెరపైకి మరో.. అలీబాబా
అలీబాబా అద్భుత దీపం, అలీబాబా 40 దొంగలు...ఇలా తెలుగు తెరపై అలీబాబా పేరుతో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. తాజా మరోఅలీబాబా తెలుగు తెరపైకి వస్తున్నాడు. తమిళ దర్శకుడు విష్ణువర్థన్ సోదరుడు కృష్ణను హీరోగా పరిచయం చేస్తూ తమిళంలో 'ఆలీబాబా" అనే చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని శ్రీ రమణ ఫిలింస్ పతాకంపై వి.రమణ... 'ఆలీబాబా ఇంట్లో అందరూ దొంగలే" పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. గతంలో వచ్చిన ఆలీబాబా సినిమాలు మంచి విజయం సాధించి నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ కూడా ఆలీబాబాతో మొదలయ్యేలా ప్లాన్ చేశారు.
ఈ సినిమా విశేషాల గురించిన వివరాలను నిర్మాత రమణ వెల్లడిస్తూ...'ప్రస్తుతం అనువాద పనులు జరుగుతున్నాయి. జనని కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని నిలన్.కె.శేఖర్ ఆద్యంతం ఆసక్తికరంగా మలిచాడు. ప్రకాష్‌రాజ్ పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా వుంటుందని, తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు.


Click it and Unblock the Notifications











