జయకు మద్దతుగా...థియేటర్లు బంద్, నిరాహాదీక్షలు
తమిళనాడు: అవినీతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్షకు గురైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మద్దతుగా తమిళ సినిమా డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం తమిళనాడు వ్యాప్తంగా థియేటర్ల బందుకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రేపు(సెప్టెంబర్ 30) అన్ని థియేటర్లలో షోలన్నీ రద్దయ్యాయి.
థియేటర్ల బంద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో జయలలితకు సంఘీభావంగా నిరాహార దీక్షలు చేయబోతున్నారు. సినీ పరిశ్రమ నుండి వచ్చి, పరిశ్రమలోని కష్టనష్టాల గురించిన తెలిసిన వ్యక్తిగా తమిళ సినీ పరిశ్రమకు జయలలిత ఎంతో మేలు చేసారని, అందుకే ఆమెకు సంఘీభావంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సినీ డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించారు.

అయితే కోర్టు తీర్పుపై డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ స్పందించలేదు. అమ్మ(జయలలిత)కు శిక్ష పడిందని తెలిసిన తమ వంతు సంఘీభావంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిస్ట్యిబ్యూటర్లు చెబుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లతో పాటు జయలలిత మద్దతు దారులంతా శోక సముద్రంలో మునిగిపోయారు.
ముఖ్యమంత్రిగా రూ. 66 కోట్లు అక్రమంగా సంపాదించారనే ఆరోపణలతో 18 ఏళ్ల క్రితం జయలలితపై కేసు నమోదైంది. సుధీర్ఘ విచారణ అనంతరం జయలలితపై నేరం రుజువైంది. దీంతో ఆమెకు 4 సంవత్సరాల జైలు శిక్ష, 100 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











