నయనతారను ‘యమకంత్రి’గా మార్చిన ప్రభుదేవా
స్టార్ హీరోయిన్ నయనతార డబ్బింగ్ సినిమాలకు కూడా తెలుగునాట భలే క్రేజ్. అది దృష్టిలో పెట్టుకునే తాజాగా 'యమకంత్రి" అనే చిత్రాన్ని ప్రేక్షకులకు డబ్బింగ్ చేసి అందిస్తున్నారు జె.పి.ఫిలిమ్స్ వారు. ప్రభుదేవా దర్శకత్వంలో విజయ్, నయనతార జంటగా రూపొందిన విల్లు అనే తమిళ చిత్రాన్ని జె.పి.ఫిలిమ్స్ పతాకంపై జి.ఉషారాణి తెలుగు ప్రేక్షకులకు 'యమకంత్రి"గా అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ-'వినోదానికి, యాక్షన్‌కి పెద్దపీట వేస్తూ రూపొందిన చిత్రమిది. ప్రభుదేవా దర్శకత్వ ప్రతిభ, విజయ్ నటన, నయనతార గ్లామర్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం పాటలను త్వరలోనే విడుదల చేస్తాం. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందన్న నమ్మకం వుంది" అన్నారు. ప్రకాష్‌రాజ్, వడివేలు, కుష్బూ, రంజిత, జ్యోతి, గీత, ముమైత్ ఖాన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: చంద్రబోస్, భువనచంద్ర, సాహితి, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సమర్పణ: జి.డి.ఆర్ మీడియా లిమిటెడ్.'


Click it and Unblock the Notifications











