రాంచరణ్ పక్కనే.. గుర్తుపట్టలేని విధంగా స్టార్ హీరో.. గగ్గోలు పెడుతున్న ఫ్యాన్స్!

Recommended Video

VVR Teaser : Hero Prashanth Became Unrecognizable In The Movie

రికార్డులు క్రియేట్ చేసిన రంగస్థలం చిత్రం తరువాత రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. టైటిల్ సాఫ్ట్ గా కనిపిస్తున్నప్పటికీ సినిమాలో కావలసినంత మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇటీవల చిత్ర యూనిట్ పవర్ ఫుల్ టీజర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ మెగా అభిమానులని అలరిస్తోంది. ఈ టీజర్ లో చరణ్ తో పాటు మరో స్టార్ హీరో కూడా మెరిశాడు. ఎట్టకేలకు అతడిని గుర్తించిన అభిమానులు సోషల్ మీడియాలో పిక్స్ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం!

జీన్స్ అందగాడు

జీన్స్ అందగాడు

20 ఏళ్ల క్రితం మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ నటించిన జీన్స్ చిత్ర పేరు చెబితే చాలు ఆ హీరో ఎవరో గుర్తుకు వచ్చేస్తాడు. ఆ హీరో మరెవరో కాదు.. ప్రశాంత్. చాలా కాలం పాటు ప్రశాంత్ తమిళ అభిమానులని రొమాంటిక్ చిత్రాలతో అలరించాడు. జీన్స్ చిత్రంతో ప్రశాంత్ తెలుగువారికి కూడా సుపరిచితమే. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ప్రశాంత్ డ్యూయెల్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే.

రాంచరణ్ సోదరుడిగా

రాంచరణ్ సోదరుడిగా


జీన్స్ చిత్రం తరువాత ప్రశాంత్ స్థాయిని పెంచేలా విజయాలు దక్కలేదు. కానీ ప్రశాంత్ సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు. విజయ విధేయ రామ చిత్రంలో ప్రశాంత్ రాంచరణ్ సోదరుడిగా నటిస్తున్నాడు. టీజర్ లో ప్రశాంత్ కనిపించే సన్నివేశాలు ఉన్నాయి. ప్రశాంత్ ని గుర్తించిన అభిమానులు ఆ పిక్స్ ని వైరల్ చేస్తున్నారు.

గుర్తుపట్టలేనివిధంగా

గుర్తుపట్టలేనివిధంగా

జీన్స్ చిత్రంతో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రశాంత్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు తమిళంలో స్టార్ హీరోగా నటించిన ప్రశాంత్ ఇపుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడని ఆయన ఫ్యాన్స్ భాదపడుతున్నారు. సరైన విజయాలు దక్కకపోవడం వలనే ప్రశాంత్ ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

అభిమానుల ఆవేదన


సోషల్ మీడియాలో ప్రశాంత్ గురించి కొంత మంది పెడుతున్న కామెంట్స్ ఇలా ఉన్నాయి.. జీన్స్, దొంగ దొంగ, చామంతి లాంటి చిత్రాలతో స్టార్ హీరోగా ప్రశాంత్ ఎదిగాడు. ఇప్పుడు అతడిని ఇలా చూడాలంటే భాదగా ఉంది. బోయపాటి శ్రీను అతడికి మంచి పాత్రనే కల్పించాడని భావిస్తున్నా అంటూ ఓ అభిమాని పేర్కొన్నారు.

ఆర్యన్ రాజేష్ కూడా

ఆర్యన్ రాజేష్ కూడా

ఈ చిత్రంలో ప్రశాంత్ తో పాటు ఆర్యన్ రాజేష్ కూడా రాంచరణ్ కు సోదరుడిగా నటిస్తున్నాడు. ఆర్యన్ రాజేష్ ఈవీవీ సత్యనారాయణ తనయుడిగా సొంతం, ఎవడిగోలవాడిది లాంటి చిత్రాలతో ఆర్యన్ రాజేష్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వినయవిధేయ రామ చిత్రంలో సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X