'గజనీ' సూర్యకు మగపిల్లాడు..హ్యాపీ
గజనీ చిత్రంతో తెలుగులోనూ పాపులర్ అయిన తమిళ సినీ హీరో సూర్యకు కుమారుడు జన్మించాడు. ఆయన భార్య, సినీనటి జ్యోతిక సోమవారం మగ పిల్లాడికి జన్మనిచ్చారు. అంతకుముందు వీరిద్దరికి దివ్య అనే పాప ఉంది. సినిమాల్లో హిట్ ఫెయిర్ గా పేరుగాంచిన సూర్య, జ్యోతిక 2006 సెప్టెంబర్ 11న పెళ్లి చేసుకున్నారు. ఆరు చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ప్రస్తుతం సూర్య...రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రక్త చరిత్ర చిత్రంలో మద్దెల చెరువు సూరిగా ప్రాధాన్యత ఉన్న పాత్ర చేస్తున్నారు. అలాగే మురగదాస్ దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేస్తున్నారు. ఇక బాబు పుట్టిన సందర్భంగా ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలుపుతోంది.


Click it and Unblock the Notifications











