హజారే దీక్ష శిబిరంలో తమిళ హీరో విజయ్
అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న సామాజిక కార్యకర్త అన్నా హజారేకు తమిళ హీరో విజయ్ తన పూర్తి మద్దతు ప్రకటించాడు. అంతే కాదు గురువారం ఢిల్లీలోని రాంలీల మైదానంలో హజారే దీక్షాశిబిరానికి చేరుకుని తన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ దేశంలో అవినీతి ప్రమాదకర స్థాయికి చేరుకుందని, దాన్ని నిర్మూలించక పోతే మన భవిష్యత్ ప్రమాదంలో పడుతుందన్నారు. వేళ్లూనుకు పోయిన అవినీతిని దాని మూలాల నుంచి తొలగించడం...బలమైన జన్ లోక్ పాల్ బిల్లు ద్వారానే సాధ్యమని స్పష్టం చేశాడు. హాజారు మద్దతుగా నిలిచిన భారతీయులందరినీ విజయ్ అభినందించారు. ఎవరి శక్తి మేర వారు అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు.
కాగా...దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన సీని పరిశ్రమలు హజారేకు తమ మద్దతు ప్రకటించాయి. పలువురు బాలీవుడ్ స్టార్ తో పాటు, టాలీవుడ్, కోలీవుడ్, సాండల్ వుడ్, మాలీవుడ్ లకు చెందిన తారలు హజారేకు మద్దతుగా ర్యాలీలు, దీక్షలు చేపడుతున్నారు. అవినీతిపై తమ అభిమానులను చైతన్య పరుస్తూ హజారే ఉద్యమానికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











