Don't Miss!
- Sports
Brett Lee Advice: కోహ్లీకి ఇంతకంటే మంచి టైం దొరకదు.. కచ్చితంగా ఈ టైం ఉపయోగించుకోవాలి
- Finance
క్రిప్టో మార్కెట్ లాభాల్లోనే ఉంది, కానీ బిట్ కాయిన్ 30,000 డాలర్లకు దిగువనే
- News
ఆధార్ కార్డ్ జిరాక్స్‌లను అందరితో పంచుకోవద్దు: ‘మాస్క్డ్ ఆధార్’పై కేంద్రం తాజా ఉత్తర్వలు
- Lifestyle
విరేచనాలు ఎక్కువ అయ్యిందా? ఈ టీలో ఏదైనా తాగితే వెంటనే ఆగిపోతాయి ...
- Automobiles
Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి
- Technology
ఆపిల్ వాచ్‌లో ఎయిర్టెల్ Wynk మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌కి యాక్సెస్!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మాస్ మహారాజాతో తమిళ మల్టీస్టారర్.. మల్టీ లింగ్యువల్ ప్లానింగ్ గట్టిగానే ఉందే!
తమిళ హీరో విష్ణు విశాల్ కి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కొన్ని సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాబోయే ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ స్టార్ రవితేజతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఆ వివరాలు

గుత్తా జ్వాలాతో వివాహం
తమిళ సినిమా ఇండస్ట్రీ లో డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ తనకంటూ ఒక సొంత మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు హీరో విష్ణు విశాల్. అయితే ఒకపక్క వరుస సినిమాలతో ఫుల్ బిజీలో ఉన్న విష్ణు విశాల్ ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలాను రెండు వివాహం చేసుకున్నారు. కరోనా సమయంలో 2020లో నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరూ గత ఏడాది ఏప్రిల్ లో సన్నిహితుల మధ్య పెళ్లితో ఒక్కటయ్యారు.

వరుసగా సినిమాల్లో
చాలా
కాలంగా
డేటింగ్
చేస్తున్న
వీరిద్దరూ
నాలుగేళ్ల
క్రితం
క్రితం
తమ
సంబంధాన్ని
ప్రకటించారు.
కాగా
విష్ణు
విశాల్
2010లో
రజనీ
అనే
అమ్మాయిని
వివాహం
చేసుకుని,
2018లో
ఆమెతో
విడిపోయారు.
జ్వాలా
కూడా
ఇంతకుముందు
చేతన్
ఆనంద్
అనే
వ్యక్తిని
వివాహం
చేసుకుంది.
జ్వాల,
చేతన్
2011లో
విడిపోయారు.
ఇక
వీరిద్దరూ
ప్రేమలో
పడి
వివాహం
చేసుకున్నారు.
తమిళ
చిత్రసీమలో
వర్ధమాన
నటుడు
విష్ణు
విశాల్.
'వనిల్లా
కబడ్డీ
జట్టు'
సినిమాతో
హీరోగా
తెరంగేట్రం
చేసి
వరుసగా
సినిమాల్లో
నటిస్తున్నాడు.

విడుదలకు సిద్ధంగా ఎఫ్ఐఆర్
విష్ణు
విశాల్
కథానాయకుడిగా
2018లో
విడుదలైన
'రాచ్చసన్'
సినిమా
సూపర్
హిట్
అయింది.
ఈ
చిత్రం
తర్వాత
అరణ్య,
మోహన్‌దాస్,
ఎఫ్ఐఆర్
తదితర
సినిమాలలో
కూడా
ఆయన
నటించారు.
ప్రభు
సోలమన్
యొక్క
కాదన్లో
చివరిగా
కనిపించిన
నటుడు,
తదుపరి
విడుదలకు
ఎఫ్ఐఆర్
సిద్ధంగా
ఉంది.
గౌతమ్
వాసుదేవ్
మీనన్
అసిస్టెంట్
మను
ఆనంద్
దర్శకత్వం
వహించిన
ఈ
సినిమా
యాక్షన్
థ్రిల్లర్
అని
చెబుతున్నారు.

అరణ్య సినిమాలో
ఇక అన్నీ బాగుంటే ఈ సినిమాను ఫిబ్రవరి 2022 లో విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంలో మంజిమా మోహన్, రైజా విల్సన్ మరియు రెబా మోనికా జాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. దర్శకులు గౌతమ్ మీనన్, గౌరవ్ నారాయణన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన అరణ్య సినిమాలో సింగా అనే పాత్రలో నటించి అందరి మన్ననలు పొందాడు విష్ణు విశాల్.
|
రవితేజ నటిస్తున్న కొత్త సినిమాలో
ఇక ఆయన తెలుగు స్టార్ హీరో రవితేజ నటిస్తున్న కొత్త సినిమాలో విష్ణు విశాల్ నటించనున్నాడు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఆయన పోస్ట్ చేసిన దాని ప్రకారం, ఈ సంవత్సరం బాగానే ప్రారంభమైంది. నటుడు రవితేజతో కొత్త చిత్రంలో నటించబోతున్నాను. ఆయనను కలవడం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడనుందని తెలిపారు. ఈ రోజుల్లో మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌లు, మల్టీ లింగ్యువల్ చాలా కామన్ అయిపోయిన క్రమంలో ఈ సినిమాను తమిళం-తెలుగు ద్విభాషా చిత్రంగా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే ఈ సినిమా టాలీవుడ్ మాస్ మహారాజా తమిళ డెబ్యూ మూవీగా ఉండేలా కనిపిస్తోంది.