»   » వీళ్లు చాలా స్పీడ్ గురూ: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై సినిమా

వీళ్లు చాలా స్పీడ్ గురూ: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై :ఏదైనా ఓ సంచలన సంఘటన జరిగితే సినిమావాళ్లు ముందుగా మేలుకుని వెంటనే కథ రెడీ చేసేస్తూంటారు. ఓ రకంగా చెప్పాలంటే ఆ న్యూస్ ని సాధ్యమైనంత త్వరలో వేడి తగ్గకముందే క్యాష్ చేసేసుకోవాలనుకుంటూంటారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి జరిగింది. సంచలనం సృష్టించిన శేషాచలం ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో తమిళంలో ఓ చిత్రం తెరకెక్కనుంది.

'తూకు మారా పోకల్‌' పేరుతో రూపొందనున్నఈ చిత్రానికి కాళిదాస్‌, ఆగస్టిన్‌ దర్శకత్వం వహించనున్నారు. ''ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల అమానవీయ చర్యకు బలైన 20 మంది తమిళుల ఆవేదనను కళ్లకు కట్టేలా ఈ చిత్రం ఉంటుంద''ని దర్శకద్వయం తెలిపింది. ఎన్‌కౌంటర్‌ వెనుక దాగున్న అసలు నిజాలను చిత్రంలో చూపిస్తామన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే....

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Tamil movie on Seshachalam encounter

శేషాచల అడవుల నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న 20 మంది కూలీలను ఇటీవల ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కథను సినిమాగా రూపొందించనున్నాయి జయవిజయ చాముండేశ్వరి ప్రొడక్షన్స్‌, స్కాట్‌ మూవీ మేకర్స్‌ సంస్థలు. ఇందులో ముఖ్యమైన నటులు నటించనున్నట్లు చిత్రవర్గాలు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ చిత్రానికి వీఆర్‌ కాళిదాస్‌, వి.అగస్టిన్‌ కలిసి దర్శకత్వం వహించనున్నారు.

'క్రైం మన్నన్‌'గా గుర్తింపు తెచ్చుకున్న కథారచయిత రాజేష్‌కుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. చందనపు చెట్లు నరికారన్న నేరానికి ఏమాత్రం మానవత్వం లేకుండా అత్యంత దారుణంగా ఎన్‌కౌంటర్‌ చేయడంలో ఆంతర్యం ఏంటి?.. అనే విషయాన్ని ఈ సినిమాలో స్పష్టం చేశామని దర్శకులు చెబుతున్నారు. ఈ చిత్రానికి సునిల్‌ గ్జేవియర్‌ సంగీతం అందించారు.

సంఘటన చోటుచేసుకున్న ప్రాంతంలో చిత్రీకరణ జరిపేందుకు చిత్రయూనిట్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో చిత్ర తారాగణం గురించి వెల్లడిస్తామని దర్శకుడు వి.ఆర్‌.కాళిదాసు తెలిపారు.

English summary
Seshachalam encounter of 20 alleged red sandalwood smugglers is creating lot of controversy. According to the latest Kollywood filmmakers are coming with a film on the encounter. Kalidas and Augustin are directing the film titled Tooku Maara Pokkal which they claim will depict the realistic side of the encounter.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu