twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాజల్ అగర్వాల్‌‌పై నిషేధం విధించండి.. తమిళనాడులో భగ్గుమంటున్న నేతలు, ప్రజలు

    |

    గ్లామర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కష్టాల వివాదంలో చిక్కుకునేటట్టు కనిపిస్తున్నది. బీజేపీని సమర్ధించేలా ట్వీట్ చేసి కష్టాలను ఆమె పీకల మీదకు తెచ్చుకొన్నది. దీంతో తమిళనాడులో కాజల్ అగర్వాల్ నటించిన చిత్రాలను నిషేధించాలని తమిళులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె తీరు ఇప్పడు మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ వివాదం నుంచి ఎలా బయటపడుతుందో చూడాల్సిందే అంటున్నారు. ఈ వివాదానికి అసలు కారణమేమిటంటే...

    పీఎం నరేంద్రమోదీ పోస్టర్ వివాదం

    పీఎం నరేంద్రమోదీ పోస్టర్ వివాదం

    వివాదాస్పద బయోపిక్ పీఎం నరేంద్రమోదీ పోస్టర్‌ను నటుడు వివేక్ ఒబేరాయ్ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో వివేక్ టైటిల్ రోల్‌ను పోషించిన సంగతి తెలిసిందే. దాంతో ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా పోస్టర్‌ను అభిమానులతో పంచుకొన్నారు. ఆ పోస్టర్‌పై కాజోల్ అగర్వాల్ స్పందించింది.

    వివేక్ ఒబేరాయ్! పోస్టర్ అద్భుతం

    వివేక్ ఒబేరాయ్ ట్వీట్ చేసిన పోస్టర్‌కు రిప్లై ఇస్తూ.. వావ్.. వివేక్! చాలా అద్భుతంగా కనిపిస్తున్నది. ఎప్పుడెప్పుడూ ఆ సినిమా చూడాలా అనే ఫిలింగ్ కలుగుతున్నది. మీ చిత్ర యూనిట్‌కు గుడ్ లక్. సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొంటుంది అని కాజోల్ ట్వీట్ చేశారు.

    ఇతర సినీ ప్రముఖులు సపోర్ట్ చేయాలి

    ఇతర సినీ ప్రముఖులు సపోర్ట్ చేయాలి

    కాజోల్ అగర్వాల్ చేసిన ట్వీట్‌పై వివేక్ ఒబేరాయ్ స్పందించారు. థ్యాంక్యూ సో మచ్ కాజల్ అగర్వాల్. మీ సపోర్ట్‌కు చాలా ధన్యుడిని. ఈ సినిమా రిలీజ్ కోసం చాలా కష్టపడుతున్న సమయంలో మీరు అందిస్తున్న సపోర్ట్ చాలా గొప్పది. మిగితా సినీ ప్రముఖులు కూడా మాకు ఇలాంటి సపోర్ట్ అందించాలి అని వివేక్ ఒబేరాయ్ ట్వీట్ చేశారు.

     వివేక్, కాజల్‌పై మండిపాటు

    వివేక్, కాజల్‌పై మండిపాటు

    అయితే కాజోల్, వివేక్ ఒబేరాయ్ మధ్య సోషల్ మీడియాలో జరిగిన సంభాషణ చూసిన నెటిజన్లు, తమిళ ప్రజలు భగ్గుమన్నారు. తమిళనాడులోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నటించిన చిత్రాలను తమిళనాడులో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

    బీజేపీకి అనధికార మద్దతా?

    బీజేపీకి అనధికార మద్దతా?

    కాజల్ అగర్వాల్‌ ట్వీట్‌కు బదులిస్తూ దారుణమైన కామెంట్లతో ధ్వజమెత్తుతున్నారు. ఎన్నికల సమయంలో బీజేపీకి మద్దతు ఇస్తారా? అంటూ ఆమెపై నానా రకాలుగా విరుచుకుపడుతున్నారు. బీజేపీకి అనధికార ప్రచారకురాలిగా వ్యవహరించిందని ఆరోపిస్తున్నారు. అయితే ఆమె తనపై వస్తున్న ట్రోల్స్‌కు జవాబు ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు.

     పీఎం నరేంద్ర మోదీపై ఈసీ నిషేధం

    పీఎం నరేంద్ర మోదీపై ఈసీ నిషేధం

    ఇదిలా ఉండగా, పలువురు ఫిర్యాదు మేరకు పీఎం నరేంద్రమోదీ సినిమాపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలు ఉన్న ప్రదేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదు. ఈ చిత్రమే కాకుండా ఎలాంటి బయోపిక్ అయినా రిలీజ్ చేయడానికి వీలు లేదు అని స్పష్టం చేసింది.

    English summary
    Tamil Politicians serious on Kajal Agarwal: demands ban on her Movies
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X