సూసైడ్ నోట్ రాసిపెట్టి వెళ్ళిపోయిన మరో నిర్మాత

కొన్ని నెలలకు ముందే ఒక మళయాల నిర్మాత తన సినిమా రషెస్ చూసుకొని అత్మహత్య కు పాల్పడ్డ సంగతి మర్చిపోక ముందే ఇప్పుడు ఇంకొక నిర్మాత కూడా నష్టాలతో అదే బాట పట్టాడు. అనే కోలీ వుడ్ నిర్మాత "మదన్" ఇంట్లో ఒక సూసైడ్ నోట్ రాసిపెట్టి మరీ ఇంటినుంచి వెళ్ళీపోయాడు..

ఆరవన్ (తెలుగులో ఏకవీర).. లింగా.. పాండియనాడు (పల్నాడు).. పాయుంపులి (జయసింహా) లాంటి భారీ బడ్జెట్ సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు కొన్ని సినిమాలు నిర్మించిన "వేందార్ మూవీస్" అధినేత అయిన మదన్ ఇలా సుసైడ్ నోట్ పెట్టి కాశీకి వెళ్లిపోయాడు.తాను వెళ్ళిపఓవటానికి కారకులు,కారణాలను పక్కాగా వెళ్ళడించకున్నా ఆర్థిక కారణాలే అని తెలుస్తోంది..

మదన్ ఆధ్వర్యంలోని వేందార్ మూవీస్.. ఎస్ఆర్ఎం గ్రూప్ లో భాగం. ఆ గ్రూప్ అధినేత అయిన పారి వేందార్ ఆరు నెలలుగా మదన్ తో మాట్లాడట్లేదట. ఆయన కుటుంబ సభ్యులు తనను ఓ ద్రోహిలాగా చూస్తున్నారని. పారి వేందార్ ఆస్తులన్నింటినీ తనకు రాసిచ్చేయబోతున్నాడని అనుమానిస్తున్నారని. అందుకే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని మదన్ సుసైడ్ నోట్ లో రాశాడు.

Tamil producer writes suicide note leaves for Varanasi

ఎస్ఆర్ఎం గ్రూప్ లోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో చేర్పించడం కోసం తాను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయల డబ్బు.., వాటి వివరాలన్నీ ఎస్ఆర్ఎం మేనేజ్మెంట్ కు అప్పగించానని. మళ్లీ తాను మరో జన్మ కోరుకోవట్లేదు కాబట్టే కాశీలో చనిపోవాలని నిర్ణయించుకుని అక్కడికి వెళ్లిపోతున్నానని అతను వెల్లడించాడు.

తాను తన జీవితం మొత్తం పారి వేందార్ కోసమే బతికానని. ఇప్పుడు కూడా తనకు ఇష్టమైన వ్యక్తి అయిన ఆయన కోసమే తన ప్రాణాలు అర్పిస్తున్నానని తెలిపాడు. అదృశ్యం కావటానికి ముందు మదన్ వదిలిన ఈ లేఖ చదవగానే కుటుంబ సభ్యులు కాశీకి బయల్దేరారు. తెలుగులో కళ్యాణ్ రామ్ "పటాస్" కు రీమేక్ గా లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న "మొట్ట శివ కెట్ట శివ" సినిమా కి కూడా మదనే నిర్మాత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X