2.0కు సవాల్.. శంకర్, రజనీ గుండెల్లో రైళ్లు.. పైరసీ బాంబు పేల్చిన వెబ్‌సైట్!

తమిళ సినిమా ఇండస్ట్రీకి పైరసీ వెబ్‌సైట్ తమిళ్ రాకర్స్ సవాల్ విసురుతున్నది. ఇప్పటికే విశాల్ నటించిన పందెంకోడి2, విజయ్ నటించిన సర్కార్ సినిమాను తొలి ఆట ముగిసే సమయానికే తమ వెబ్‌సైట్లో రిలీజ్ చేశారు. తాజాగా 2.0 చిత్రానికి సవాల్ విసిరుతూ ట్వీట్ చేశారు. ట్విట్టర్‌లో ఏం పోస్ట్ చేశారంటే...

త్వరలోనే విడుదల చేస్తాం

త్వరలోనే విడుదల చేస్తాం

సూపర్ స్టార్ రజనీ, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న 2.0 సినిమాను త్వరలో విడుదల చేస్తున్నాం అని తమిళ రాకర్ ట్విట్టర్ అకౌంట్‌లో ఓ సందేశం కనిపించింది. దీంతో తమిళ సినిమా పరిశ్రమలో ఆందోళన వ్యక్తమవుతున్నది.

Recommended Video

2.0 - Official Trailer [Telugu] - Rajinikanth
సర్కార్‌ను బజారుకీడ్చిన తమిళ్ రాకర్స్

సర్కార్‌ను బజారుకీడ్చిన తమిళ్ రాకర్స్

కొద్ది రోజుల క్రితం విడుదలైన సర్కార్‌ చిత్రంను తమిళ రాకర్ వెబ్‌సైట్ ఉక్కుపాదంతో తొక్కేసింది. పైరసీ కాకుండా కోలీవుడ్ చేసిన ప్రయత్నాలను తప్పికొట్టింది. హీరో విశాల్‌కు, తమిళ రాకర్స్ పైరసీ దారులకు మధ్య భారీ యుద్ధమే జరుగుతున్న సంగతి తెలిసిందే.

బాంబు పేల్చిన పైరసీ వెబ్‌సైట్

బాంబు పేల్చిన పైరసీ వెబ్‌సైట్

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో 2.0 చిత్రాన్ని నవంబర్ 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. భారతీయ సినిమా చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాను రూ.600 కోట్లతో 3డీ టెక్నాలజీలో రూపొందించారు. ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తుందని భావిస్తున్న తరుణంలో తమిళ్ రాకర్ బాంబు పేల్చింది.

భారీ నష్టం వాటిల్లే పరిస్థితి

భారీ నష్టం వాటిల్లే పరిస్థితి

ఒకవేళ 2.0 మూవీని రిలీజ్ రోజే తమిళ్ రాకర్స్ పైరసీ చేస్తే భారీ నష్టమే జరిగే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో రూపొందించిన లైకా ప్రొడక్షన్‌ రాబడికి భారీ గండిపడే అవకాశం లేకపోలేదు. తమిళ్ రాకర్ విసిరిన సవాల్‌తో తమిళ సినీ వర్గాల్లో, చిత్ర యూనిట్‌లో ఆందోళన మొదలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X