త్రిష క్రేజ్ చూపి తమిళ ప్లాఫ్ ని తెలుగులోకి
ఆర్య, త్రిష, జెడి చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా తమిళంలో వచ్చిన 'సర్వం" చిత్రాన్ని అదే పేరుతో సింహపురి టాకీస్ పతాకంపై తెలుగులో అనువదిస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో మంచి ఓపినింగ్స్ తెచ్చుకోలగలిగినా ఫస్ట్ వీక్ కే ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో త్రిష చిల్డ్రన్స్ స్పెషలిస్టుగా కనిపిస్తుంది. ఓ విచిత్రమైన కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర ఇంటర్వెల్ కే చనిపోవటంతో ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు. ఇక దర్శకుడు విష్ణు వర్ధన్ కి ఈ చిత్రం ముందు విపరీతమైన క్రేజ్ ఉంది. ఎందుకంటే ఆయన దర్శకత్వంలో అజిత్, నయనతార, నమిత కాంబినేషన్ లో వచ్చిన భిళ్ళా (తెలుగులో ప్రభాస్ తో రీమేక్) భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకు ముందు భరత్ తో చేసిన పట్టియల్ (గాయం) చిత్రం కూడా పెద్ద హిట్టు. దాంతో వీటి ప్రభావంతో ఓపినింగ్స్ తెచ్చుకున్నా కథ, కథనంల సమస్యతో భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయింది. ఇక ఈ చిత్రాన్ని అనువాదం చేస్తున్న నిర్మాతలు ఇంతకుముందు 'అనంతపురం 1980" ని తెలుగులో డబ్ చేసారు.


Click it and Unblock the Notifications











