న్యూడ్ ఫోటోస్‌తో బెదిరింపులు... ప్రముఖ సింగర్ అనుకుని మోసపోయిన అమ్మాయిలు!

ప్రముఖ బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ తెరిచి మహిళలను మోసం చేసి, బ్లాక్ మెయిల్ చేసిన 30 ఏళ్ల యువకుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన సినిమా సర్కిల్‌లో హాట్ టాపిక్ అయంది.

తమిళనాడులోని విల్లుపురం జిల్లా ఉలుందూరుపేటకు చెందిన మహేంద్ర వర్మన్ సింగర్ అర్మాన్ మాలిక్ పేరుతో ఖాతా తెరిచి కొందరు మహిళలతో స్నేహం చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే వారి నుంచి న్యూడ్ ఫోటోస్ రాబట్టుకున్నాడు. అవి తన వద్దకు రాగానే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి డబ్బు గుంజడం మొదలు పెట్టాడు.

పోలీస్ ట్రాప్‌లో చిక్కాడు

పోలీస్ ట్రాప్‌లో చిక్కాడు

పలువురు మహిళల నుంచి అతడు లక్షలు రాబట్టినట్లు తెలుస్తోంది. అందులో ఓ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో... జిల్లా క్రైమ్ బ్రాంచి పోలీసులు ట్రాప్ చేశారు. పలానా ప్లేసులో డబ్బు ఇస్తానని ఆ మహిళతో చెప్పించి...అతడు అక్కడికి రాగానే డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వివిధ సెక్షన్ల కింద కేసులు

వివిధ సెక్షన్ల కింద కేసులు

మహేంద్ర వర్మన్ మీద ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354 బి(మహిళలపై క్రిమినల్ చర్యలకు పాల్పడటం), 354 సి, 384, 506 ఐ(బెదిరింపులకు పాల్పడం), ఐటి యాక్ట్ 66ఇ(ఇతరుల ప్రైవసీకి భంగం కలిగించడం), 66డి(కంప్యూటర్ సోర్స్ ఉపయోగించి ఇతరులను మోసం చేయడం) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఈజీ మనీ కోసం అడ్డదారులు

ఈజీ మనీ కోసం అడ్డదారులు

నిందితుడు టీచర్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేసి గత రెండేళ్లుగా ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. జాబ్ వదిలేసి ఈజీగా డబ్బు సంపాదించడానికి సోషల్ మీడియా ద్వారా మోసాలు చేయడం మొదలు పెట్టినట్లు గుర్తించారు.

అర్మాన్ మాలిక్

అర్మాన్ మాలిక్

23 ఏళ్ల అర్మాన్ మాలిక్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ గాయకుడు. తన అద్భుతమైన టాలెంటుతో 11 ఏళ్ల వయసులోనే ‘తారే జమీన్ పర్' సినిమాలో పాడే అవకాశం దక్కించుకున్నాడు. బాలీవుడ్లో ఇప్పటి వరకు వందకుపైగా పాటలు పాడారు. అతడికి ఉన్న క్రేజ్ ఆసరగా చేసుకుని... నకిలీ అకౌంట్ క్రియేట్ చేసిన మహేంద్ర వర్మన్ మోసాలకు పాల్పడి దొరికిపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X