Don't Miss!
- News తారకరత్న భార్య బిగ్ ట్విస్ట్ ..ఆ పార్టీకే మద్దతంటూ ప్రకటన
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
వర్మకు మరో షాక్.. ఆన్లైన్లో లీకైన ‘క్లైమాక్స్’.. ఆ వంద కూడా ఎవ్వరూ పెట్టరేమో?
రామ్ గోపాల్ వర్మ చేసిన శపథం మేరకు క్లైమాక్స్ సినిమాను చెప్పిన టైమ్‌కు రిలీజ్ చేశాడు. అయితే తమిళ రాకర్స్ కూడా వారి ధ్యేయాన్ని పూర్తి చేసుకున్నారు. క్లైమాక్స్ చిత్రాన్ని ఒరిజినల్ దానికి సమానంగా లీక్ చేసి మరోసారి వారి సత్తా ఏంటో నిరూపించారు. దీంతో వర్మ యూనిట్‌కు పెద్ద షాక్ తగిలింది. అయితే ఈ లీకులపై సోషల్ మీడియాలో మీమ్స్ ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి.
క్లైమాక్స్‌తో సంచలనం..
శృంగార తార మియా మాల్కోవాలోని అందాలను కొత్తకోణంలో ఆవిష్కరిస్తూ విడుదల చేసిన టీజర్ ట్రైలర్ ఓ రేంజ్లో వైరల్ అయింది. ఓ వైపు కరోనాతో అందరూ సతమతమవుతుంటే.. ఆర్జీవీ మాత్రం కూల్‌గా క్లైమాక్స్‌తో హీటెక్కించాడు.
రేటు కూడా ఫిక్స్..
అయితే కరోనా సంక్షోభం కారణంగా థియేటర్లు ఇప్పుడే ప్రారంభం కావన్న సంకేతాలు వచ్చాయి. దీంతో తన క్లైమాక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాల్సిందేనని, దాన్ని ఎవ్వరూ ఆపలేరని శ్రేయాస్ ఎంటర్టైన్మెంట్ యాప్ ద్వారా నేరుగా ఆన్లైన్లోనే విడుదల చేశారు.
వంద కడితేనే ఎంట్రీ..
క్లైమాక్స్ సినిమాను చూడాలన్నా ఆ లింక్ ఓపెన్ కావాలన్నా వంద కట్టాలని రేటు ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో సినిమాకు నెలకొన్న బజ్ మేరకు బాగానే స్పందన వచ్చింది. మొదటి రోజు యాభై వేల మంది చూస్తారని అనుకుంటే.. 2.75లక్షల మంది రెడీగా ఉన్నారట. ఈక్రమంలో పన్నెండు గంటల్లోనే 1,68,596 మంది వీక్షించి సరికొత్త రికార్డును నెలకొల్పారట.
Recommended Video
క్షణాల్లోనే లీక్..
అయితే వర్మకు పెద్ద షాకే తగిలింది. క్లైమాక్స్ రిలీజైన కొద్ది క్షణాల్లోనే తమిళ రాకర్స్ తమ పనితనాన్ని చూపెట్టారు. ఈ మూవీని పైరసీ చేసి వదిలారు. అయితే సినిమాకు బ్యాడ్ టాక్ రావడంతో బజ్ మొత్తం పడిపోగా.. ఈ లీక్ సమస్యతో రెవెన్యూకూడా పడిపోయేలా కనిపిస్తోంది. ఇక ఆ వంద కూడా ఖర్చు చేయకుండానే క్లైమాక్స్‌ను ఫ్రీగా చూసేస్తున్నారు.