twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మకు మరో షాక్.. ఆన్‌లైన్‌లో లీకైన ‘క్లైమాక్స్’.. ఆ వంద కూడా ఎవ్వరూ పెట్టరేమో?

    |

    రామ్ గోపాల్ వర్మ చేసిన శపథం మేరకు క్లైమాక్స్ సినిమాను చెప్పిన టైమ్‌కు రిలీజ్ చేశాడు. అయితే తమిళ రాకర్స్ కూడా వారి ధ్యేయాన్ని పూర్తి చేసుకున్నారు. క్లైమాక్స్ చిత్రాన్ని ఒరిజినల్ దానికి సమానంగా లీక్ చేసి మరోసారి వారి సత్తా ఏంటో నిరూపించారు. దీంతో వర్మ యూనిట్‌కు పెద్ద షాక్ తగిలింది. అయితే ఈ లీకులపై సోషల్ మీడియాలో మీమ్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.

    క్లైమాక్స్‌తో సంచలనం..

    క్లైమాక్స్‌తో సంచలనం..

    శృంగార తార మియా మాల్కోవాలోని అందాలను కొత్తకోణంలో ఆవిష్కరిస్తూ విడుదల చేసిన టీజర్ ట్రైలర్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. ఓ వైపు కరోనాతో అందరూ సతమతమవుతుంటే.. ఆర్జీవీ మాత్రం కూల్‌గా క్లైమాక్స్‌తో హీటెక్కించాడు.

    రేటు కూడా ఫిక్స్..

    రేటు కూడా ఫిక్స్..

    అయితే కరోనా సంక్షోభం కారణంగా థియేటర్లు ఇప్పుడే ప్రారంభం కావన్న సంకేతాలు వచ్చాయి. దీంతో తన క్లైమాక్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాల్సిందేనని, దాన్ని ఎవ్వరూ ఆపలేరని శ్రేయాస్ ఎంటర్టైన్మెంట్ యాప్ ద్వారా నేరుగా ఆన్‌లైన్‌లోనే విడుదల చేశారు.

    వంద కడితేనే ఎంట్రీ..

    వంద కడితేనే ఎంట్రీ..

    క్లైమాక్స్ సినిమాను చూడాలన్నా ఆ లింక్ ఓపెన్ కావాలన్నా వంద కట్టాలని రేటు ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో సినిమాకు నెలకొన్న బజ్ మేరకు బాగానే స్పందన వచ్చింది. మొదటి రోజు యాభై వేల మంది చూస్తారని అనుకుంటే.. 2.75లక్షల మంది రెడీగా ఉన్నారట. ఈక్రమంలో పన్నెండు గంటల్లోనే 1,68,596 మంది వీక్షించి సరికొత్త రికార్డును నెలకొల్పారట.

    Recommended Video

    Climax Movie Review And Rating
    క్షణాల్లోనే లీక్..

    క్షణాల్లోనే లీక్..

    అయితే వర్మకు పెద్ద షాకే తగిలింది. క్లైమాక్స్ రిలీజైన కొద్ది క్షణాల్లోనే తమిళ రాకర్స్ తమ పనితనాన్ని చూపెట్టారు. ఈ మూవీని పైరసీ చేసి వదిలారు. అయితే సినిమాకు బ్యాడ్ టాక్ రావడంతో బజ్ మొత్తం పడిపోగా.. ఈ లీక్ సమస్యతో రెవెన్యూకూడా పడిపోయేలా కనిపిస్తోంది. ఇక ఆ వంద కూడా ఖర్చు చేయకుండానే క్లైమాక్స్‌ను ఫ్రీగా చూసేస్తున్నారు.

    English summary
    RGV Mia Malkova Climax Leaked In Online. Tamilrockers Are Faster Than Original Producers. Climax Was Simultaneously Leaked In TamilRockers
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X