twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గెలిచి సురేష్ బాబు సీట్లోకి వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ

    By Srikanya
    |

    హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఎన్నికయ్యారు. ఆదివారం రాత్రి డి.సురేష్‌బాబు నుంచి ఛాంబర్‌ అధ్యక్ష బాధ్యతలు తమ్మారెడ్డి భరద్వాజ స్వీకరించారు. 2012-13 సంవత్సరానికి సంబంధించిన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. ఈ దఫా అధ్యక్ష పదవి నిర్మాతల విభాగానిది. ఈ క్రమంలోనే భరద్వాజ, స్రవంతి రవికిశోర్‌ ప్యానెళ్ల మధ్య హోరాహోరీగా ఈ ఎన్నికలు జరిగాయి. భరద్వాజకి అత్యధికంగా 472 ఓట్లు లభించాయి. 12 పదవులకుగానూ ఆయన తరఫున 11మంది గెలిచారు. ఫలితాలు వెల్లడించాక జరిగిన సమావేశంలో ఆయన్ని ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు.

    ఈసారి ఫిలిం చాంబర్‌ ఎన్నికలు హోరాహోరిగా జరిగాయి. ఎవరికి వారు న్యూస్‌ పేపర్లో ప్రచారం కూడా నిర్వహించుకున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ చిన్న నిర్మాతలకు ప్రాతినిద్యం వహించగా, స్రవంతి రవికిషోర్‌ పెద్ద నిర్మాతలకు ప్రాతినిద్యం వహించారు. రవికిషోర్‌ ప్యానెల్‌లో పోటీ చేసిన ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సైతం ఓడిపోయారు. ఆయనకు అతి తక్కువగా ఓట్లు పోలవడం గమన్హారం. ఇక తమ్మారెడ్డి ప్యానెల్‌లో పోటీ చేసిన విజయచందర్‌, జీవితా రాజశేఖర్‌ గెలుపొందారు. ఈ ఎన్నికలలో చిన్న నిర్మాతల హవా స్పష్టంగా కనిపించింది. భరద్వాజ అందరికీ అందుబాటులో వుండే వ్యక్తిగ, చిన్న నిర్మాతల పక్షపాతిగా పేరుతెచ్చుకోవడంతో అంతా ఆయనవైపే మొగ్గుచూపారు.

    ఉపాధ్యక్షులుగా నాగినీడు, వీరినాయుడు, మల్లేష్‌ యాదవ్‌, కార్యదర్శులుగా కె.అశోక్‌ కుమార్‌, ఆర్‌.వి.భూపాల్‌ ప్రసాద్‌, సహాయ కార్యదర్శులుగా జీవితారాజశేఖర్‌, కె.వి.వి.ప్రసాద్‌, వి.ఎన్‌.ఆర్‌.నాగేశ్వరరావు, జి.మహేశ్వర్‌రెడ్డి, కె.వంశీకిషోర్‌, జె.లక్ష్మణరావు, కోశాధికారిగా విజేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. నిర్మాతల సెక్టార్‌ కమిటీ ఛైర్మన్‌గా నట్టికుమార్‌, ఎగ్జిబిటర్స్‌ సెక్టార్‌కి వి.పురంధర్‌, స్టూడియో సెక్టార్‌కి పి.కిరణ్‌, డిస్ట్రిబ్యూటర్‌ సెక్టార్‌కి సి.భరత్‌చౌదరి ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు.

    ఆదివారం రాత్రి డి.సురేష్‌బాబు నుంచి ఛాంబర్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ''చిత్ర పరిశ్రమకు మంచి చేయడమే నా లక్ష్యం. నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనదారులు... ఎవరికి ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కరించేందుకు కృషి చేస్తాన''న్నారు. వాణిజ్యమండలి కార్యవర్గ సభ్యుడు టి.ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ''యాక్టివ్‌ నిర్మాతలమంటూ ఎన్ని చెప్పినా నమ్మకుండా భరద్వాజ ప్యానెల్‌కి ఓటు వేసి గెలిపించారు. ఇది నూటికి నూరుపాళ్లు నిర్మాతల విజయం. దాసరి నారాయణరావు ఆశీస్సులతోనే ఈ కమిటీ ఎన్నికైంద''న్నారు. థియేటర్ల గుత్తాధిపత్యాన్ని రూపుమాపడంతోపాటు, అద్దెల విధానంలోనూ మార్పు తీసుకొస్తామన్నారు నట్టికుమార్‌.

    English summary
    Senior Director and producer Tammareddy Bharadwaj is the new president for Andhra Pradesh Film Chamber of Commerce. Elections for the president post and other governing body were held on Sunday (July 29, 2012) and Tammareddy and 11 other members from his panel won comfortably over Sravanthi Ravikishore and his panel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X