నా ఫేవరేట్ హీరో బాలకృష్ణ.. చిరంజీవిని మళ్లీ కెలికిన తమ్మారెడ్డి.. పవన్ అలా మొండిపట్టు..

దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం తెలిసిందే. తాను ఫీలైన విషయాన్ని ఎలాంటి తడబాటు లేకుండా వెల్లడిస్తుంటారు. ఇటీవల ప్రముఖ హాస్య నటుడు అలీ నిర్వహించే కార్యక్రమానికి హాజరైన తమ్మారెడ్డి మాట్లాడుతూ.. తనకు నచ్చిన హీరో బాలకృష్ణ అని వెల్లడించారు. కానీ చిరంజీవితో తనకు అనుబంధం ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో బాలయ్య నచ్చాడని చెప్పారు. బాలకృష్ణ నచ్చడానికి కారణాలు చెబుతూ..

 బాలకృష్ణ ఎందుకు ఇష్టమంటే

బాలకృష్ణ ఎందుకు ఇష్టమంటే

నాకు తెలుగు హీరోలలో బాలకృష్ణ, చిరంజీవితో చాలా మంచి రిలేషన్ ఉంది. ఇద్దరిలో ఎవరు ఇష్టమంటే నాకు బాలకృష్ణ అని చెబుతాను. ఎందుకంటే టాప్ హీరోలుగా ఎదిగిన తర్వాత కొందరి యాటిట్యూడ్ వస్తుంది. అలాంటి యాటిట్యూడ్, ఎలాంటి ఇగో లేని హీరో బాలకృష్ణ. ఆయనతో నాకు పెద్దగా పరిచయం కూడా లేదు.

చిరంజీవితో రిలేషన్

చిరంజీవితో రిలేషన్

ఇక బాలకృష్ణ కంటే చిరంజీవితో నాకు రిలేషన్‌షిప్ ఉంది. హీరోగా నిలదొక్కుకునే సమయం నుంచి చిరంజీవితో పరిచయం ఉంది. ఆయన రూంలో నేను ఉండేవాడిని. మా ఆఫీస్‌కు అక్కడే చిరంజీవి పడుకొనేవాడు. చిరంజీవి కారును నేనే స్వయంగా నడిపే వాడిని. మెగాస్టార్‌గా మారిన తర్వాత చిరంజీవి మారిపోయాడు. ఆ తర్వాత సంబంధాలు తగ్గిపోయాయి.

బాలకృష్ణ మనస్తత్వం నచ్చింది

బాలకృష్ణ మనస్తత్వం నచ్చింది

ఎన్టీఆర్ తనయుడిగా బాలకృష్ణ తెలుసు. కానీ నేరుగా పరిచయం లేదు. కానీ ఆయన మనస్తత్వం అంటే నాకు ఇష్టం. ఆయన ఎందుకు నచ్చాడంటే. తెలుగు పరిశ్రమ 75 ఏళ్ల ఫంక్షన్ చేసినప్పుడు బాలకృష్ణ వ్యవహరించి తీరు ఆకట్టుకొన్నది. దాంతో నాకు మంచి రిలేషన్ ఏర్పడింది.

ఆ ఫంక్షన్‌లో హీరోలు అలా

ఆ ఫంక్షన్‌లో హీరోలు అలా

75 ఏళ్ల ఫంక్షన్ సమయంలో పది రోజులకుపైగా హీరోలతో రిహార్సల్, ఇతర పనులను నేనే పర్యవేక్షించాను. చాలా మంది హీరోలు యాటిట్యూడ్ చూపించారు. సమయానికి వచ్చే వాళ్లు కాదు. వచ్చినా వాళ్లకు నచ్చినట్టు ప్రవర్తించే వాళ్లు. కానీ బాలకృష్ణ మాత్రం సాధారణ వ్యక్తిలా బిహేవ్ చేశారు.

బాలకృష్ణ సమయ పాలన

బాలకృష్ణ సమయ పాలన

బాలకృష్ణ ప్రతీ రోజు ఉదయం 7 గంటలకే వచ్చే వాడు. సాయంత్రం వెళ్లేటప్పుడు చెప్పి వెళ్లడమే కాకుండా మరుసటి రోజు ఎప్పుడు రావాలని అడిగేవాడు. చాలా సాదాసీదాగా ఉండేవాడు. ఆ సమయంలో క్రమశిక్షణ, సింప్లిసిటీ నాకు బాగా నచ్చింది. అందుకే నాకు బాలకృష్ణ వ్యక్తిగతంగా బాగా నచ్చాడు.

పవన్ కల్యాణ్ అలా మొండిపట్టు

పవన్ కల్యాణ్ అలా మొండిపట్టు

75 ఏళ్ల ఫంక్షన్‌లో పవన్ కల్యాణ్ డ్యాన్స్ చేయనని మొండికేశాడు. కానీ నేను పట్టుబట్టి పవన్ కల్యాణ్ చేయాల్సిందేనని అన్నాను. దాంతో శంకర్ దాదా పాటకు శ్రీకాంత్ స్థానంలో పవన్ కల్యాణ్ చేసేలా ఒప్పించాను. ఆ పాటకు పవన్ కల్యాణ్ డ్యాన్స్ చేయడంతో గొప్పగా ప్రశంసలు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X