ఆ రాత్రికి తమన్నా ఒప్పుకుందట: భారీ ఆఫర్.. ఎక్కడో తెలుసా?..

కొత్త సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పేవేళ.. కొత్తగా ఎలా ఎంజాయ్ చేద్దామా? అన్న ప్లాన్స్ కొందరివైతే.., కొత్త ఆదాయ మార్గాలను వెతికే ప్లాన్స్ సెలబ్రిటీలవి. న్యూ ఇయర్స్ సెలబ్రేషన్స్‌కు సెలబ్రిటీ టచ్ తోడైతే ఆ రచ్చే వేరు కాబట్టి.. ఈవెంట్ మేనేజర్స్, ఆర్గనైజర్స్ వాళ్లను రప్పించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.

ఈ నేపథ్యంలోనే అంది వచ్చిన అవకాశాలను ఫుల్లుగా క్యాష్ చేసుకోవడానికి సిద్దమైపోయారు కొంతమంది హీరోయిన్లు. ఇందులో భాగంగా హీరోయిన్ తమన్నా ఓ భారీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

 డిసెంబర్ 31, రాత్రి:

డిసెంబర్ 31, రాత్రి:

డిసెంబర్ 31వ తేదీ రాత్రి గుంటూరులోని ఓ రిసార్టులో డ్యాన్స్ చేయడానికి తమన్నా ఒప్పుకుందట. ఇందుకోసం భారీ పారితోషకం అందుకోబోతుందని తెలుస్తోంది. ఐటెం సాంగ్స్, ఇతర సినిమా సాంగ్స్ తో ఆ రాత్రి తమన్నా రచ్చ చేయనుంది. తమన్నా వస్తోందని తెలియగానే.. అటు అభిమానులు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు గుంటూరు రిసార్టుకు క్యూ కట్టేస్తున్నారట.

 ఈసారి గుంటూరులో 'తమన్నా':

ఈసారి గుంటూరులో 'తమన్నా':

తమన్నా ప్రతీ ఏటా అమెరికాలో జరిగే న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఈసారి హైదరాబాద్, బెంగుళూరు పబ్స్, రిసార్టుల నుంచి ఆమెకు భారీ ఆఫర్సే వచ్చాయట.

అయితే చివరగా గుంటూరు రిసార్ట్ వాళ్లు ఇచ్చిన ఆఫర్‌నే తమన్నా ఓకె చేశారట. మొత్తానికి డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనుకేసుకోవాలన్న ఉద్దేశంతో.. న్యూ ఇయర్ వేడుకల్లో ఆడి పాడటానికి హీరోయిన్లు సైన్ చేసేస్తున్నారు.

 ఈసారి హైలైట్ సన్నీయే:

ఈసారి హైలైట్ సన్నీయే:

ఈ న్యూ ఇయర్ వేడుకల్లో అందరి కన్నా సన్నీ లియోన్ హైలైట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 31వ తేదీ రాత్రి వేడుకల కోసం బెంగుళూరు రిసార్టు నుంచి ఆమెకు ఏకంగా రూ.5కోట్లు పారితోషకం ఆఫర్ చేయడం విశేషం.

 కర్ణాటకలో 'సన్నీ' వివాదం:

కర్ణాటకలో 'సన్నీ' వివాదం:

న్యూ ఇయర్ వేడుకల్లో సన్నీలియోన్ డ్యాన్సులను ఎంజాయ్ చేయాలని కొందరు భావిస్తుంటే.. సన్నీ అసలు బెంగుళూరులో అడుగుపెట్టవద్దని కర్ణాటక రక్షణ వేదిక యువసేన సంఘం డిమాండ్ చేస్తోంది. సన్నీ వస్తే తామంతా ఒకేసారి ఆత్మహత్యలు చేసుకుంటామని వారు హెచ్చరించడం గమనార్హం.

 గోవాలో రకుల్:

గోవాలో రకుల్:

ఇక 2017లో వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపిన క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్.. న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్తోంది. ఈ నెల 28న గోవాకు వెళ్లి.. ఐదు రోజుల వరకు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆమె పాల్గొనే పార్టీలో ఇతర స్టార్స్ కూడా పాల్గొంటారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X