twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్లాప్ షో.. చిరంజీవి వెళ్లినా నిరసన, ఇద్దరూ రోడ్డున పడ్డారు!

    |

    Recommended Video

    Tammareddy Bharadwaj Talks About Maa Issue

    మా అసోసియేషన్ లో చీటికి మాటికీ వివాదాలు చెలరేగుతున్నాయి. ఆ మధ్యన మా అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ కోసం నిధులు సేకరించడానికి అమెరికాలో ఈవెంట్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్ కు వచ్చిన నిధుల విషయంలో అనుమానాలు ఉన్నట్లు నరేష్ తెలపడంతో వివాదం మొదలైంది. ఈ వివాదంలో అటు నరేష్, ఇటు మా ప్రెసిడెంట్ శివాజీ రాజా ఇద్దరూ ప్రెస్ మీట్స్ పెట్టి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారడంతో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

    తప్పు చేయకపోతే అకౌంట్లు చూపండి.. ప్రభుత్వాలు నిగ్గు తేల్చాలి.. 'మా' వివాదంపై మనోజ్ మంచుతప్పు చేయకపోతే అకౌంట్లు చూపండి.. ప్రభుత్వాలు నిగ్గు తేల్చాలి.. 'మా' వివాదంపై మనోజ్ మంచు

    ఇద్దరూ మంచి వాళ్లే

    ఇద్దరూ మంచి వాళ్లే

    నరేష్, శివాజీ రాజా ఇద్దరూ తనకు చిన్నప్పటి నుంచి తెలిసినవాళ్ళే అని తమ్మారెడ్డి అన్నారు. ఇద్దరికీ స్వార్థం లేదు. కానీ ఇలా రోడ్డు మీదికి వచ్చి ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం చాలా భాదగా ఉందని తమ్మారెడ్డి తెలిపారు.

    అమెరికాలో

    అమెరికాలో

    మా అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా నిధులు సేకరించేందుకు శివాజీ రాజా అమెరికాలో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈవెంట్ ద్వారా మాఅసోసియేషన్ కు వచ్చిన నిధుల విషయంలో దుర్వినియోగం జరిగిందనేది నరేష్ ఆరోపణ.

    చిరంజీవి వచ్చినా

    చిరంజీవి వచ్చినా

    కానీ ఆ ఈవెంట్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని తమ్మారెడ్డి అన్నారు. ఈవెంట్ ప్లాప్ షోగా మిగిలిపోయిందని మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. చిరంజీవి హాజరైన నేపథ్యంలో స్పెషల్ స్టేటస్ గురించి నిరసనలు ఎదురయ్యాయని తమ్మారెడ్డి అన్నారు. మురళి మోహన్ మా అధ్యక్షుడుగా ఉన్న సమయంలో కూడా క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణకు సంబంధించి ఆరోపణలు వినిపించాయి.

     ఎందుకు గొడవ

    ఎందుకు గొడవ

    సక్సెస్ కానీ ఈవెంట్ గురించి నరేష్, శివాజీ రాజా ఎందుకు ఇంతగా గొడవ పడుతున్నారో అర్థం కావడం లేదు. ఆదాయం రాని షోకు లంచంఇచ్చే పరిస్థితి ఉండదని తమ్మరెడ్డి అభిప్రాయ పడ్డారు.

    హాస్యాస్పదంగా

    హాస్యాస్పదంగా

    మా అసోసియేషన్ కమిటీలు ఉన్నాయి. ఏదైనా సమస్య ఉంటే కమిటీలలో చర్చించాలి. కానీ ఇలా ప్రెస్ మీట్స్ పెట్టి ఒకరిని ఒకరు తిట్టుకుంటుంటే హాస్యాస్పదంగా ఉందని తమ్మారెడ్డి అన్నారు.

    English summary
    Tammareddy about MAA Association Controversy. Tammareddy Reveals Shocking Facts about Sivaji Raja, Naresh
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X