తెలుగు చిత్ర పరిశ్రమకి క్షమాపణలు చెప్పుకొన్న తమ్మారెడ్డి భరద్వాజ!
టాలీవుడ్ లో మగాళ్ళు లేరు" అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసి, సినీ పరిశ్రమ ఆగ్రహాన్ని చవిచూసిన తమ్మారెడ్డి భరద్వాజ ఎట్టకేలకు తన వ్యాఖ్యలకుగాను క్షమాపణ చెప్పుకున్నారు. సినీ పరిశ్రమలో అందరూ తనను పెద్దన్నగా భావిస్తారనీ, తన తమ్ముళ్ళు, తన పిల్లలుగా హీరోలను భావించే, వారిపై కాస్తంతా ఘాటుగా కామెంట్ చేశాననీ, తన ఉద్దేశ్యం కొత్త కథలపై హీరోలు మోజు చూపడంలేదనేనని, అంతకన్నా ఎవరిపైనా తనకు కోపం లేదని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు ఓ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో.
తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కొత్త దనం వైపు పరుగులు తీస్తోందనీ, చిన్న సినిమాలు కొత్తదనంతో వస్తున్నాయనీ, అలాగే 'మగధీర" వంటి వెరైటీ సినిమా భారీ వసూళ్ళను రాబట్టిందనీ 'సోప్" రాసే ప్రయత్నం చేస్తున్నారు తమ్మారెడ్డి భరద్వాజ. అటు హీరోలూ, దర్శక నిర్మాతలు ఇద్దరూ కష్టపడి తెలుగు సినిమా స్థాయిని పెంచాలని అభిలషించిన తమ్మారెడ్డి భరధ్వాజ, తెలుగు సినీ పరిశ్రమ భారతదేశంలోనే అత్యధికంగా సినిమాలు నిర్మిస్తోందని అన్నారు. సత్తా వున్న హీరోలు, దర్శకులు, నిర్మాతలూ కొత్త దనం వైపు అడుగులు తీస్తే తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ ఖ్యాతిని పొందుతుందని అభిప్రాయపడ్డారు తమ్మారెడ్డి భరద్వాజ.


Click it and Unblock the Notifications











