బుద్దుండే చేసిందా? అమలా పాల్ నగ్నంగా నటించడంపై తమ్మారెడ్డి కామెంట్

అమలా పాల్ ప్రధాన పాత్రలో రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం 'ఆడై'. ఈ చిత్రం తెలుగులో 'ఆమె' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జులై 19న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలుగు రైట్స్ కొనుగోలు చేసిన తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నలభైఏళ్ల నా ప్రస్థానంలో ఎంతో మంది కొత్తవారితో చేశాం, అంత:పురం లాంటి సినిమాలు చేశాం. కానీ ఇన్నేళ్లలో ఎప్పుడూ తగలని షాక్ 'ఆమె'. ఈ సినిమా పోస్టర్ చూసి కమర్షియల్‌గా ఉంది, జనాలు చూస్తారనే నమ్మకంతో కొన్నామన్నారు.

బుద్దుండే ఈ సినిమా చేయడానికి ఒప్పుకుందా?

బుద్దుండే ఈ సినిమా చేయడానికి ఒప్పుకుందా?

వెళ్లి సినిమా చూసిన తర్వాత నాకు ఒకటే అర్థం కాలేదు. దర్శకుడు రత్నకుమార్ ఈ కథ ఎలా రాశాడు? ఎందుకు రాశాడు? అతడికి బుద్దుండి రాశాడా? బుద్దిలేక రాశాడా? తెలియదు. అతడికి బుద్దిలేకపోతే సరే... ఈ పిల్ల(అమలా పాల్)కు బుద్ది ఉండాలి కదా. బట్టల్లేకుండా ఉండే కాన్సెప్టుతో అతడు కథ రాస్తే ఈవిడ చేస్తాననడం ఏమిటి. ఈ ఇద్దరే అనుకుంటే ప్రొడ్యూసర్ చేస్తాననడం ఇంతకంటే పిచ్చోడు. వాళ్లకంటే పెద్ద పిచ్చోడు ఈ సినిమాను కొనుగోలు చేసిన నేను.

ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే...

ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే...

ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే... సినిమాను ప్రేమించడం ముఖ్యం. చాలా మంది ఈ కాన్సెప్ట్ చెప్పగానే నగ్నంగానా? అలా ఎలా చేస్తారు? అంటారు. ఆలోచించడానికి కూడా భయపడతారు. ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక డ్రీమ్. దాన్నే మనం సినిమాగా తీస్తాం. ఒక పాత్రను నగ్నంగా చూపించాల్సిన పరిస్థితి ఏమిటి? అనేది ముఖ్యం. అది కన్విన్సింగ్‌గా ఉంటే నగ్నంగా చేయడంలో తప్పులేదు.

అమలా పాల్‌కే సాధ్యం

అమలా పాల్‌కే సాధ్యం

ఇలాంటి కథ చేయడానికి గట్స్ కావాలి. దీనికి ధైర్యంగా ముందుకు వచ్చిన అమలా పాల్‌ను అభినందించాలి. సినిమా చూశాను. ఈ జనరేషన్లో ఇంత పెర్ఫార్మ్ చేసిన ఆర్టిస్టును నేను చూడలేదు. ఇలాంటి సినిమాను కొన్నందుకు గర్వంగా ఉందే తప్ప బాధ లేదు.

ఈ సినిమా నాకు గొప్ప అనుభవం

ఈ సినిమా నాకు గొప్ప అనుభవం

నాకంటూ ఇండస్ట్రీలో ఒక ఇమేజ్ ఉంది. నేను ఆడవాళ్లకు సంబంధించిన, సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు తీస్తాను. ఆడినా ఆడక పోయినా పిచ్చి సినిమాలు తీస్తాడు భరద్వాజ అని అంటుంటారు. ఈ సినిమా కొనుగోలు చేయడం పిచ్చో, మంచి తెలియదు. నా జీవితంలో మరచిపోలేని సినిమా అవుతుంది. ఇది నాకు గ్రేటెస్ట్ ఎక్స్‌పీరియన్స్.... అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X