అడవి శేష్‌కి అంత ఒళ్ళు బలుపా.. వాడుకుని వదిలేసిన వైనం, తమ్మారెడ్డి ఆవేదన!

Recommended Video

Tammareddy Bharadwaj Talks About Adivi Sesh

అడవి శేష్ నటించిన గూఢచారి చిత్రం విజయవంతంగా రన్ అవుతోంది. స్పై థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అడవిశేష్ నటుడిగా, రచయితగా గూఢచారి చిత్రంతో మంచి మార్కులు కొట్టేశాడు. అడవిశేష్ పై ఓ వైపు ప్రశంసలు కూరుతున్నాయి. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అడవి శేష్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తనని వాడుకుని వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.

టాలీవుడ్‌లో అందరితో

టాలీవుడ్‌లో అందరితో

తాను 40 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నా. చాలా మంది పేరుగాంచిన దర్శకులు, నటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులతో తాను కలసి పనిచేశానని తమ్మారెడ్డి అన్నారు. తన జరిగిన అవమానాన్ని ప్రస్తావించే నేపథ్యంలో తమ్మారెడ్డి ఈ విషయాలు తెలియజేశారు.

అంకుల్ అంటూ వచ్చి

అంకుల్ అంటూ వచ్చి

అడవిశేష్ నా దగ్గరకు వచ్చి అంకుల్ చిన్న హెల్ప్ కావాలి అని అడిగాడు. తాను చేయబోతున్న సినిమాలో చిన్న గెస్ట్ రోల్ చేయాలి అని అన్నాడు. నాకు నటన రాదు. ఇలాంటి విషయాలన్నీ నాకు అనవసరం అని చెప్పా. మీరు చేస్తే నాకు హెల్ప్ అవుతుంది అని రిక్వస్ట్ చేస్తే అంగీకరించా.

ఫస్ట్ కాపీ

ఫస్ట్ కాపీ

ఒకరోజు వెళ్లి షూటింగ్ డబ్బింగ్ ఫినిష్ చేశా. పూర్తయిన తరువాత అడవి శేష్ వచ్చి ఫస్ట్ కాపీ మీకే చూపిస్తా అంకుల్ అని అన్నాడు. కాపీ రెడీ అయింది. ఆడియో వేడుకలు, ప్రీరిలీజ్ వేడుకలు అన్నీ జరిగిపోయాయి. కానీ ఒక్కరు కూడా పట్టించుకోలేదు.

ఆవేదన

ఆవేదన

నేనేం వాళ్ళ వద్దకు వెళ్లి వేషం కావాలని అడుక్కోలేదు. సాయం కావాలని అడిగితే చేశా. అవసరం తీరిపోయాక ఎందుకు పట్టించుకోలేదు. అంత కేర్లెస్ ఏంటి అని తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంతోమంది

ఎంతోమంది

నలభై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. అడవిశేష్ లాంటి వాళ్ళని ఎంతమందిని చూసి ఉంటా అని తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు. సినిమా పూర్తయ్యాక ఆప్యాయంగా పలకరించి థాంక్స్ చెప్పి ఉంటే బావుండేది అని తమ్మారెడ్డి అన్నారు.

అంత ఒళ్ళు బలుపా

అంత ఒళ్ళు బలుపా

కనీసం నా వంక కూడా చూడకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అడవి శేష్ కు అంత ఒళ్ళు బలుపు ఏంటి అంటూ తమ్మారెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. సక్సెస్ ముఖ్యం కాదని అన్నారు. సక్సెస్ ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది. మనం ఎంతమంది దగ్గర గౌరవం ఇచ్చి పుచ్చుకున్నాం అనేదే ముఖ్యం అని తమ్మారెడ్డి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X