twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పయితే క్షమించండి: నారా లోకేష్‌కి తమ్మారెడ్ది భరద్వాజ సంచలన సమాధానం

    నంది అవార్డుల వివాదం పై ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మరోసారి స్పందించారు. లోకేష్ ఏదైనా మాట్లాడేముందు ఆయన తండ్రి పరువు గురించి ఆలోచించుకోవాలని సూచించారు.

    |

    Recommended Video

    నారా లోకేష్‌కి తమ్మారెడ్ది సంచలన సమాధానం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014, 2015, 2016 కుగానూ నంది అవార్డుల ఎంపిక సక్రమంగా లేదంటూ కొందరు, తమకు అన్యాయం జరిగిందని మరికొందరు, మమ్మల్ని గుర్తించలేదని ఇంకొందరు బాహటంగానే విమర్శిస్తున్నారు. ముఖ్యంగా 2014 అవార్డుల గురించే అందరూ మాట్లాడుతున్నారు. లెజెండ్ సినిమాకు మొత్తం 9 అవార్డుల రావడమేంటని ప్రశ్నిస్తున్నారు. నంది అవార్డుల వివాదం పై ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మరోసారి స్పందించారు.

    తమ్మారెడ్డి భరద్వాజ

    తమ్మారెడ్డి భరద్వాజ

    ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో చాలా హుందాగా వ్యవహరించారని... అవార్డుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారని తమ్మారెడ్డి అన్నారు. తాను కూడా ఇదే అంశంపై మాట్లాడుతూ, అవార్డులను కులాలకు, మతాలకు, పార్టీలకు ఆపాదించవద్దని మొన్ననే చెప్పానని తెలిపారు.

     ఆంధ్రాలో ఆధార్ కార్డు లేనివారు

    ఆంధ్రాలో ఆధార్ కార్డు లేనివారు

    చంద్రబాబు వరకు అంతా బాగానే ఉందని. మంత్రి లోకేష్ ఈ అంశంపై స్పందించిన తీరు మాత్రం బాగోలేదని అన్నారు. ఆంధ్రాలో ఆధార్ కార్డు లేనివారు కూడా ఈ అంశంపై విమర్శలు చేస్తున్నారంటూ లోకేష్ మాట్లాడారని. ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి అబ్బాయి ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం తనకు బాధను కలిగించిందని చెప్పారు.

     మీరు ఇప్పటికీ హైదరాబాదులోనే ఉంటున్నారు

    మీరు ఇప్పటికీ హైదరాబాదులోనే ఉంటున్నారు

    లోకేష్ ఏదైనా మాట్లాడేముందు ఆయన తండ్రి పరువు గురించి ఆలోచించుకోవాలని సూచించారు. మొన్నటి దాకా మీకు ఆధార్ కార్డులు ఎక్కడున్నాయి? మీరు ఇప్పటికీ హైదరాబాదులోనే ఉంటున్నారు, మీకు మాట్లాడే అర్హత ఉందా? అని తాము అడిగితే బాగోదని... చాలా అసహ్యంగా ఉంటుందని చెప్పారు.

    హుందాగా వ్యవహరించాలి

    హుందాగా వ్యవహరించాలి

    లోకేష్ చాలా హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇవి తెలుగు సినిమాలకు ఇస్తున్న అవార్డులని... ఆధార్ కార్డులకు ఇస్తున్న అవార్డులు కాదని... ఆధార్ కార్డులకు ఇచ్చే అవార్డులను పెడితే, అప్పుడు ఎవరైనా మాట్లాడితే, అది తప్పని తమ్మారెడ్డి అన్నారు.

     తప్పు అనిపిస్తే తనను క్షమించాలి

    తప్పు అనిపిస్తే తనను క్షమించాలి

    అప్పుడు మీరు ఏది అన్నా ఎవరూ మాట్లాడరని చెప్పారు. అవగాహన లేకుండా మాట్లాడి మీ పరువు, మీ నాన్నగారి పరువు, రాష్ట్రం పరువు తీయవద్దని సూచించారు. చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవమని, ఆయనతో కలసి పని చేశానని, లోకేష్ ను చిన్నప్పటి నుంచి చూశానని... అందుకే తన మనసులోని ఆలోచనను ఓ సలహా రూపంలో లోకేష్ కు ఇస్తున్నానని చెప్పారు. తప్పు అనిపిస్తే తనను క్షమించాలని, ఒప్పైతే స్వీకరించాలని అన్నారు.

    English summary
    The Veteran Filmmaker Tammareddy Bharadwaj responded on the comments made by AP CM Chandrababu Naidu and IT Minister Nara Lokesh over the Nandi Awards controversy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X