బాలయ్య ఇష్టం.. అంటే చిరంజీవిని కెలికినట్లా? ఆ విషయాలు మాట్లాడరేం?

నాకు బాలకృష్ణ బాగా ఇష్టమైన వ్యక్తి అని చెప్పిన మాట నిజమే. అయితే దానికి ఒక సందర్భం ఉంది. ఎన్టీ రామారావుగారు ఆ రోజుల్లో సమయ పాలనలో ది బెస్ట్ అనేలా ఉండేవారు. దర్శకుడు పేకప్ చెప్పిన తర్వాతే వెళ్లేవారు. ఒక నిబద్దత కలిగిన నటుడు ఆయన. అలాగే బాలయ్య కూడా... ఆయనతో నేను సినిమా చేయక పోయినా టాలీవుడ్ 75 ఇయర్స్ ఫంక్షన్ చేసినపుడు ఆయనలో ఆ క్రమ శిక్షణ చూశాను. అందుకే నాకు నచ్చాడు అని చెప్పాను. అలా చెప్పడం నేను చిరంజీవిని కెలకడం ఎలా అవుతుంది? అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.

బాలయ్య అలా అడగటం ఆశ్చర్యం వేసింది

బాలయ్య అలా అడగటం ఆశ్చర్యం వేసింది

టాలీవుడ్ 75 ఇయర్స్ ఫంక్షన్ చేసినపుడు.. బాలయ్య ఉదయం మా దగ్గరకు వచ్చి నేను వచ్చానని చెప్పడంతో పాటు... వెళ్లేపుడు నేను వెళ్లనా? ఉదయం ఎప్పుడు రావాలి అని అడిగి వెళ్లేవారు. ఒక పెద్ద స్టార్, ఒక హీరో అలా అడగటం నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. బాగా నచ్చిందని తమ్మారెడ్డి గుర్తు చేసుకున్నారు.

అలా అంటే చిరంజీవిని కెలికినట్లా?

అలా అంటే చిరంజీవిని కెలికినట్లా?

30 మంది నటులను ఆ రోజు మేము కోఆర్డినేట్ చేస్తుంటే అందులో ఒకరిగా బాలయ్య వచ్చి అలా అడిగితే సంతోషం వేసింది. అందుకే నాకు నచ్చిన నటుడు అన్నాను. దాన్ని తీసుకెళ్లి చిరంజీవిని కెలికిన భరద్వాజ.. బాలకృష్ణను పొగిడిన భరద్వాజ అంటే నేను ఏం చేయాలి? నేను బాలకృష్ణ మంచోడు అంటే చిరంజీవి చెడ్డోడు అని అనుకుంటే అది మీ తప్పా? నా తప్పా? అంటూ తమ్మారెడ్డి ప్రశ్నించారు.

చిరంజీవి నాకు తమ్ముడి కంటే ఎక్కువ

చిరంజీవి నాకు తమ్ముడి కంటే ఎక్కువ

చిరంజీవి నాకు సొంత తమ్ముడి కంటే ఎక్కువ... మేము కలిసుండటం, విడిపోవడం అనేది ఉండదు. అతనెవరో... నేనెవరో.. కలిసి పని చేశాం. కలిసి పని చేసినపుడు ఇద్దరికీ ఒక అనుబంధం ఏర్పడింది. అనుబంధం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. ఆ జ్ఞాపకాలైతో పోవు కదా. అలా అని నేను చిరంజీవిని తిట్టినట్లు కాదు. మన సొంత మనుషుల గురించి మనం ఎప్పుడూ చెప్పం. మనకు తెలియని వారి గురించి చెబుతాతమని.... తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

చిరంజీవిని పొగిడిన భరద్వాజ అనడం లేదెందుకు?

చిరంజీవిని పొగిడిన భరద్వాజ అనడం లేదెందుకు?

చిరంజీవి నాకు ముందు నుంచి తెలుసు. అతడు ఎలా చేశాడు? ఎంత చేశాడో తెలుసు. డబ్బులు తీసుకోకుండా సినిమా చేశాడని కూడా చెప్పాను. దాని గురించి ఎవరూ మాట్లాడరేం? బాలయ్యను పొగిడి చిరంజీవిని కెలికిన భరద్వాజ అంటున్నారే తప్పితే... చిరంజీవిని పొగిడిన భరద్వాజ అనడం లేదెందుకు? అన్నారు.

దాన్ని హైలెట్ ఎందుకు చేయరు?

దాన్ని హైలెట్ ఎందుకు చేయరు?

చిరంజీవికి షూటింగులో కాళ్లు కొట్టుకుపోయి రక్తం కారుతుంటే ఈ రోజు షూటింగ్ వద్దురా బాబూ వెళ్లిపోమని చెప్పినా వెళ్లిపోకుండా పని చేశాడని చెప్పాను. దాన్ని హైలెట్ ఎందుకు చేయరు? మీరు మీకు కావాల్సిన విధంగా సందర్భాలను మలుచుకుుంటారు. ఎక్కడ కెలికితే అల్లరి అవుతుందో అక్కడే కెలుకుతారు. అది నా తప్పు కాదా.... అని వ్యాఖ్యానించారు.

నేను ఎవరికీ శత్రువును కాదు..

నేను ఎవరికీ శత్రువును కాదు..

నాకు నా ఇష్టం వచ్చింది. నేను నమ్మింది చెబుతాను. నాకు ఇతడు ఇష్టుడు.. ఇతడు ఇష్టం కాదు అని ఎప్పుడూ చెప్పను. నేను ఎవరికీ శత్రువును కాదు... తెలిసి ఎవరినీ విమర్శించను. తెలియకుండా ఏదైనా వస్తే రావొచ్చు. నేను నమ్మింది చెబుతాను. యూట్యుబులో జనం చూడటం కోసం కొన్ని థంబ్ నెయిల్స్ పెడతాం... దాన్ని పట్టుకుని నన్ను మరొకరికి శత్రువుగా చూపడం సరికాదు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X