"రామ్ గోపాల్ వర్మ టెర్రరిస్టా? చంద్రబాబుకు అప్పుడు లేని భయం ఇప్పుడెందుకు? "

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా కోసం రామ్ గోపాల్ వర్మ బెజవాడలో ప్రెస్ మీట్ పెట్టుకుంటానంటే అడ్డుకుని, అరెస్ట్ చేసి, తిరిగి హైదరాబాద్ పంపడంపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఆ రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదే రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి సీఎస్‌ను మార్చేసిందని, మమ్మల్ని ఏదీ చేయనీయడం లేదు అంటూ స్టేట్ గవర్నమెంట్ గగ్గోలు పెడుతోంది. మరి వర్మ ప్రెస్ మీట్ ఆపడం వెనక ఎవరు ఉన్నారు? ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిందా? లేక కొత్తగా వచ్చిన సీఎస్ చేశాడా? రామ్ గోపాల్ వర్మ ఏమైనా దేశ ద్రోహా? టెర్రరిస్టా? నక్సలైటా? ఎందుకు అతడిని విజయవాడలోకి రానివ్వలేదు? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టనీయలేదు? అంటూ తమ్మారెడ్డి ప్రశ్నించారు.

చంద్రబాబు ఒక సినిమా చూసి భయపడటమా?

చంద్రబాబు ఒక సినిమా చూసి భయపడటమా?

వర్మ ఒక సినిమా తీశాడు, దానికి సెన్సార్ అయింది.. రిలీజ్ కోసం ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో రిలీజైంది... మంచో చెడో ఆ సినిమా ద్వారా ఓ విషయం చెప్పాడు. ఏపీలో సినిమా రిలీజ్ అయితే ఏమిటి సమస్య? ఇన్నాళ్లు ధైర్యంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒక సినిమా రావడం చూసి భయపడటానికి గల కారణం ఏమిటి? అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

భయపడితే ఆరోజే బయపడాల్సింది

భయపడితే ఆరోజే బయపడాల్సింది

‘‘చంద్రబాబు నాయుడు ఈ రోజు కాదు భయపడాల్సింది.. ఆ రోజున ఎన్టీ రామారావుగారి తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయినపుడు, కొంత మంది నువ్వే రామారావును పడగొట్టాడు, వెన్నుపోటు పొడిచావ్ అంటున్న రోజుల్లో భయపడి ఉండాలి. కానీ అప్పుడు భయపడలేదు. నమ్ముకున్న దానికోసం పోరాటం చేశాడు, మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీని రన్ చేస్తున్నాడు.'' అని తమ్మారెడ్డి గుర్తు చేసుకున్నారు.

అయినా ఆ సినిమా ఏం చేస్తుంది?

అయినా ఆ సినిమా ఏం చేస్తుంది?

‘‘ఎంతో ధైర్యంగా ఇన్నాళ్లు గడిపిన చంద్రబాబు ఈ రోజు రామ్ గోపాల్ వర్మ అనే ఒక చిన్న వ్యక్తి తీసిన ఒక సినిమా కోసం భయపడటమా? అయినా ఆ సినిమా ఏం చేస్తుంది? ఆల్రెడీ ఎన్నికలు కూడా అయిపోయాయి. ఎన్నికలు ఉంటే ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందేమో అనుకోవచ్చు. కానీ ఇపుడు అది కూడా లేదు. అయినా సినిమాను అడ్డుకోవడం ఎందుకు? '' అని ప్రశ్నించారు.

వర్మ మాత్రమే కాదు ఎవరినీ అడ్డుకోవద్దు

వర్మ మాత్రమే కాదు ఎవరినీ అడ్డుకోవద్దు

భయంతో మీరు బ్రతికితే... భయంతోనే చచ్చిపోతారు. ఎలాంటి పరిస్థితి అయినా ధైర్యంగా ఎదుర్కోవాలి. అది రైటా? రాంగా? అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు... మీరు, నేను డిసైడ్ చేయడం కాదు. ఈ ప్రజాస్వామ్యాన్ని చంపంకండి. రామ్ గోపాల్ వర్మనే కాదు ఎవరినీ అరెస్ట్ చేయవద్దు.స్వేచ్ఛగా మాట్లాడనివ్వండని తమ్మారెడ్డి సూచించారు.

మనం ప్రజాస్వామ్యంలో లేనట్లే ఉన్నాం

మనం ప్రజాస్వామ్యంలో లేనట్లే ఉన్నాం

‘‘ఒక పక్క వరవరరావును తీసుకెళ్లి ఎక్కడో పడేశారు. బెయిల్ పిటీషన్ పెడితే అది కూడా కుదరదు అంటున్నారు. బెయిల్ ఇస్తే పారిపోతాడట. 80 ఏళ్ల పెద్దాయన పారిపోయే అవకాశం ఉందా? లేదంటే నక్సలైట్లు వచ్చి చంపేస్తారని అంటారు. ఈ దేశం ఎక్కడికి వెళుతోంది. మనం ప్రజాస్వామ్యంలో లేనట్లే ఉన్నాం. వరవరరావు విషయంలో ఇలా అయిందనుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో రామ్ గోపాల్ వర్మకు జరిగింది. ఈ దేశం బాగుపడాలంటే ఈ పరిస్థితిలో మార్పు రావాలి.'' అని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X