Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా మాటలకు స్పందించే ఎన్టీఆర్ 'అదుర్స్'...తమ్మారెడ్డి
జూ ఎన్టీఆర్ నా మాటలకు పాజిటివ్ గా స్పందించి 'అదుర్స్'లో భిన్న పాత్ర చేశాననీ, ఇక నుంచీ తన ప్రతి సినిమాలో డిఫరెంట్ పాత్రలు చేస్తాననీ చెప్పాడు నాతో అనీ అంటున్నారు తమ్మారెడ్డి భరద్వాజ. అలాగే వెంకటేశ్ 'ఈనాడు'లో డిఫరెంట్ రోల్ చేశా కదా అని చెప్పారని చెప్పారాయన. ఆ మధ్య ఆయన హీరోలపై చేసిన కామెంట్ కు స్పందన అది అని చెప్తున్నారు.అలాగే మన హీరోలంతా ఒకే రకమైన కథలతో సినిమా చేస్తున్నారు. భిన్న పాత్రలు చేయగలిగీ చేయడానికి ప్రయత్నించడం లేదు. ఆ ఉద్దేశంతోటే 'గజిని', 'మై హూ నా', 'లగాన్', 'తారే జమీన్ పర్' వంటి సినిమాలు చెయ్యగల మగాళ్లు తెలుగు హీరోల్లో లేరని చెప్పా. దాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలే కానీ నెగటివ్‌గా తీసుకుంటే నేనేం చెయ్యలేను. నాకు భాషా పరిజ్ఞానం లేదు. నాది పామరుడి భాష. కావాలనో, సెన్సేషనల్ చెయ్యాలనో ఆ మాటలు చెప్పలేదు. పోతే నేను మాట్లాడే విధానమే అది అని ఆయన సమర్ధించుకున్నారు.ఇక మంచి స్క్రిప్టులు వస్తే తాను చేస్తానని మోహన్‌బాబూ అన్నారు.అయితే ఇక్కడో సంగతి చెప్పాలి. ఎనిమిదేళ్ల క్రితమే 'గజిని' వంటి గెటప్ ఉండే స్క్రిప్టుని మన హీరోలకు ఇచ్చా. వారు 'ఛీ ఛీ' అని దాన్ని విసిరికొట్టారు అంటూ ముగించారు భరద్వాజ.
తెలుగు హీరోల్లో మగాళ్లు లేరని తమ్మారెడ్డి భరద్వాజ ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలల చలన చిత్రోత్సవాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించారు. తెలుగులో దమ్మున్న హీరోలు లేరని ఆయన అన్నారు. బాలీవుడ్ లో దమ్మున్న హీరోలున్నారని, వారు ఏ స్క్రిప్టునైనా ఆమోదిస్తారని ఆయన అన్నారు. అమీర్ ఖాన్ లా తారే జమీన్ పర్ వంటి సినిమాల్లో చేసేవారు తెలుగులో ఉన్నారా, అటువంటి సినిమాను అంగీకరిస్తారా అని ఆయన అడిగారు. తారే జమీన్ పర్ సినిమాలాంటిది తెలుగు హీరోలు చేయబోరని ఆయన అన్నారు. తెలుగులోనే కాదు, ఇతర భాషల్లో కూడా బాలల చిత్రాలు రావడం లేదని ఆయన అన్నారు. సినిమా నిర్మాణం డబ్బుతో కూడిన వ్యాపారం కాబట్టి ప్రయోజనాత్మక చిత్రాలు రావడం లేదని ఆయన అన్నారు. అలాగే రీసెంట్ గా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో సినిమా వారసులు నటులు కాదంటూ తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించి మరోసారి సంచలనానికి తెరలేపారు.