twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్‌కు హ్యాట్సాఫ్.. కానీ?, వాళ్లేం పీకలేదనే కదా మిమ్మల్ని తీసుకొచ్చారు: తమ్మారెడ్డి భరద్వాజ

    |

    Recommended Video

    పవన్ కళ్యాణ్ వల్లే ప్రత్యేక హోదా...!

    ప్రముఖ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ రాష్ట్ర, మరియు దేశ రాజకీయాలపై స్పందించారు. యూట్యూబ్‌లో 'నా ఆలోచన' చానెల్ ద్వారా సమకాలీన పరిస్థితులపై తన అభిప్రాయాలు వెల్లడిస్తూ వస్తున్న ఆయన.. తాజా పరిణామాలపై స్పందించారు. రాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

    రెండు మార్పులు:

    రెండు మార్పులు:

    ఇటీవల దేశంలో రెండు పెనుమార్పులు జరిగాయి. ఒకటి ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి. గతంలో సీఎం, డిప్యూటీ సీఎంలు పోటీ చేసిన స్థానాలను ఇప్పుడు ఎస్పీ గెలుచుకుంది. అంటే, 80శాతం సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన యూపీ సీఎం.. 11నెలల కాలంలోనే గతంలో ఆయన గెలిచిన స్థానాన్ని కోల్పోయారు. ఇంతలోనే ఎంత మార్పు.

     మోడీ, జైట్లీ అహంకారం..:

    మోడీ, జైట్లీ అహంకారం..:

    ఇన్నాళ్లు మోడీ, జైట్లీ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న తీరుకు మీడియా కూడా భయపడుతూ వచ్చింది. కానీ యూపీలో బీజేపీ ఓటమితో కచ్చితంగా మీడియా కూడా దానిపై చర్చించాల్సిన అనివార్యత ఏర్పడింది. లేదంటే, ఎప్పటిలాగే మీడియా మోడీకి భజన చేస్తుండేది. ఇక బీహార్ లో ఆర్జేడీ గెలవడంలో ఆశ్చర్యం లేకపోయినప్పటికీ.. నితీష్ కుమార్ తో జతకట్టాక కూడా బీజేపీ ఓడిపోవడం గమనార్హం.

    రెండో మార్పు.. పవన్:

    రెండో మార్పు.. పవన్:

    ఇక రెండో మార్పు పవన్ కల్యాణ్ టీడీపీ బీజేపీల డ్రామాపై మాట్లాడటం. ఈ రెండు పార్టీలు నాలుగేళ్లుగా తెలుగు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇంతలోనే టీడీపీ నుంచి ఎటాక్ మొదలైంది. పవన్ ను పిచ్చివాడని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. పిచ్చివాడైతే.. 2014లో ఆయన ఇంటికెళ్లి మద్దతు ఎందుకు కోరారు?

     హ్యాట్సాఫ్ టు పవన్.. కానీ?:

    హ్యాట్సాఫ్ టు పవన్.. కానీ?:

    ఇన్నాళ్లు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సంజీవని అన్నారు.. ఆ తర్వాత కాదన్నారు. ఆయన గురించి చలసాని శ్రీనివాస్ లాంటి వాళ్లు, వామపక్షాలు మాట్లాడితే మీడియా కూడా పట్టించుకోలేదు. కానీ పవన్ కల్యాణ్ మాట్లాడాక ఒక చర్చ మొదలైంది. మీడియా కూడా దానిపై చర్చ చేస్తోంది.

    అందుకే ట్విట్టర్ మెసేజ్‌లతో ఒరిగేదేమి ఉండదు.. నువ్వు జనంలోకి రావాలని పవన్ కల్యాణ్‌కు గతంలోనే చెప్పా. ఇప్పటికైనా ఆ పని చేసినందుకు సంతోషం. ఆయన ఇదే స్టాండ్ మీద ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. కాబట్టి.. హ్యాట్సాఫ్ టు పవన్ కల్యాణ్.. అయితే అది నిన్నటివరకే. ఆ తర్వాత కూడా ఆయన ఇదే స్టాండ్‌పై ఉంటారా?.. లేక ఎప్పటిలాగే స్టాండ్ మారుస్తారా? అన్నది చూడాలి.

     వాళ్లేం పీకలేదనే కదా..:

    వాళ్లేం పీకలేదనే కదా..:

    బీజేపీ వాళ్లు మాట్లాడితే కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారు. ఆ పార్టీ పనైపోయింది. రాష్ట్రంలోనూ దేశంలోనూ కాంగ్రెస్ పరిస్థితి అందరికీ తెలిసిందే. కాబట్టి.. వాళ్లు ఏం పీకలేకపోయారనే కదా ప్రజలు మిమ్మల్ని తీసుకొచ్చారు. మీరు దాని గురించి పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీనే విమర్శిస్తూ కూర్చుంటే ఎలా?. మొత్తానికి మొన్న రాజస్తాన్ లో దెబ్బ, నిన్న యూపీలో దెబ్బ.. అలాగే నాసిక్ నుంచి ముంబైకి రైతుల పాదయాత్ర.. ఇవన్నీ చూస్తుంటే ప్రజల్లో భయంకరమైన అసంతృప్తి ఉందనేది స్పష్టమవుతోంది.

    English summary
    Tammareddy Bharadwaj About Pawan Kalyan's Speech on AP CM Chandrababu Naidu. Tollywood Veteran Director Tammareddy Bharadwaj Talks about Pawan Kalyan Latest Speech on the occasion of Janasena Formation Day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X