ఎవరితో పడితే వారితో వెళ్లొద్దు: కాస్టింగ్ కౌచ్ మీద తమ్మారెడ్డి కామెంట్

By Bojja Kumar

Recommended Video

Sri Reddy's Comments : Tammareddy Bharadwaj Counter

తెలుగు సినిమా ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ గురించి శ్రీరెడ్డి, గాయిత్రి గుప్తా లాంటి నటీమణులు మీడియా ఛానల్స్‌కు ఎక్కి పలు సంచలన విషయాలు బయట పెడుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్‌లో ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

 వారి పేర్లు బయట పెట్టండి

వారి పేర్లు బయట పెట్టండి

కాస్టింగ్ కౌచ్ మీద ఈ మధ్య కొంత మంది అమ్మాయిలు టీవీ ఛానల్స్‌కు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది నిజమే అని నేను చాలా సార్లు చెప్పాను. ఇపుడు ఓపెన్‌గా కొంత మంది మీడియా ముందుకొచ్చారు కాబట్టి అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే పెద్ద ప్రొడక్షన్స్ హౌస్‌లలో ఇలాంటివి నాకు తెలిసి జరుగవు. డైరెక్టర్లు ఒకరిద్దరు చేస్తున్నారని విన్నాను. నిజమో అబద్దమో నాకు తెలియదు కానీ విన్నాను. వీరు చెప్పేవారిలో వారున్నారో లేదో నాకు తెలియదు. అయితే ఎప్పుడైన ఇంత ఓపెన్ గా వచ్చినపుడు ఆ పేర్లు బయడట పెడితే కశ్చితంగా ఇండస్ట్రీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది... అని తమ్మారెడ్డి వ్యాఖ్యానిచారు.

 ఆ యాడ్లు చూసి మోసపోవద్దు

ఆ యాడ్లు చూసి మోసపోవద్దు

మనం ఎవరి పేరు బయట పెట్టకపోతే ప్రయోజనం ఉండదు. ఇలాంటివి జరుగుతున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎవరు మోసం చేస్తున్నారు? అనేది బయటకు వస్తే బావుంటుంది. పలానా నూతన నటీనటులు కావాలెను అంటూ టీవీల్లో, పేపర్లలో వచ్చే యాడ్లు చూసి మోసపోవద్దు. నేను చాంబర్లో యాక్టివ్ గా ఉన్న రోజుల్లో టీవీల్లో, పేపర్లలో వచ్చిన యాడ్లను యాజమాన్యాలకు ఫోన్ చేసి తీయించేసిన సందర్భాలు ఉన్నాయి. ఇపుడు మళ్లీ ఆ యాడ్లు విరివిరిగా వేయడం మొదలు పెట్టారు... అని తమ్మారెడ్డి తెలిపారు.

 ఎవరితో పడితే వారితో వెళ్లవద్దు

ఎవరితో పడితే వారితో వెళ్లవద్దు

ఇక్కడ సమస్య ఏమిటంటే ఇండస్ట్రీని ఇలా చేయాలి అలా చేయాలి అని నిర్దేశించలేం. వచ్చే వారు చిన్న పిల్లలేం కాదు. ఒక అమ్మాయిని ఏదో చేయబోయాడు అంటే లాగి అక్కడే ఒకటి పీకండి. అలా చేస్తే ఆ అమ్మాయి జోలికి ఎవరూ రారు. రెండో పాయింట్ మనం వెళుతున్నవాడు సరైనోడా? కాదా? వాడు సినిమా తీస్తాడా? తీయడా? వీడి చరిత్ర ఏమిటి అని తెలుసుకోకుండా వెళ్లడం తప్పు.... అని తమ్మారెడ్డి సూచించారు.

మీడియేటర్లు విచ్చలవిడిగా తయారయ్యారు

మీడియేటర్లు విచ్చలవిడిగా తయారయ్యారు

ఇపుడు మీడియేటర్లు అని తయారయ్యారు. నేను చాంబర్లో ఉన్న రోజుల్లో చెబుతూనే వచ్చాను. ఈ మీడియేటర్లను పెంచకూడదు, అరికట్టాలని చెప్పాను. కానీ ఈ రోజుల్లో మీడియేటర్ వ్యవస్థ విచ్చలవిడితనం అయిపోయింది. ఎవరెవరో వస్తారు.. ఈవెంట్ల కోసం పిలుస్తారు, సినిమాల్లో వేషాలు అని పిలుస్తారు. వాళ్లు మోసం చేస్తారు. మీడియేటర్లు ఎవరో ఇండస్ట్రీలో కూడా తెలియనంత ఎక్కువ మంది అయిపోయారు. దీనిపై ఇండస్ట్రీ సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది..... అని తమ్మారెడ్డి తెలిపారు.

పేర్లు చెబితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది

పేర్లు చెబితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది

ఇలాంటివి జరిగితే హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎంత పెద్దవాడైనా ఆపాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇది ఎట్లా ప్రూవ్ చేయాలి? ఈ రోజు ఓపెన్ గా వచ్చిన అమ్మాయిలను నేను అభినందిస్తున్నాను. అయితే ఎంత బోల్డ్ గా వచ్చి మాట్లాడుతన్నారో అంతే బోల్డ్ గా వారి పేర్లు కూడా చెప్పండి. వారిపై చర్యలు తీసుకోవడానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది. వారు నిజంగా చెండాలంగా బిహేవ్ చేసి ఉంటే రూల్స్ ప్రకారం సస్సెండ్ చేసే అవకాశం కూడా ఉంది.... అని తమ్మారెడ్డి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X