twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీటిని బయోపిక్ అంటారా?.. ఎన్టీఆర్‌ను రోడ్డుమీదకు ఈడ్చారనే బాధ, ‘యాత్ర’ను చంపేశారనే ఆవేదన!

    |

    ఇప్పుడంతా బయోపిక్స్ రాజ్యం అయిపోయింది. అవి బయోపిక్ అని మనం అనుకుంటున్నాం... కానీ అవి బయోపిక్‌లా ఉండటం లేదని దర్శక నిరక్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్-కథానాయకుడు, యాత్ర చిత్రాలను ప్రస్తావిస్తూ తమ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    ఎన్టీ రామారావుగారిపై సినిమా తీశారు కానీ ఓ విషయంలో బాధగా ఉంది. సినిమా తీయడం ఎవరి ఇష్టం వారిది. అయితే అందులో నిజా నిజాలు చెబుతారో చెప్పరో అని ఎవరికి వారు ఆయన రాజకీయ జీవితాన్ని, సినిమా జీవితాన్ని రచ్చకీడ్చేశారు. రోడ్డు మీదకు లాక్కొచ్చారు. అలా చేయడం ఆయనంటే భక్తిగా ఉండే నా లాంటి వారికి చాలా మనస్తాపాన్ని కలిగించిందని తెలిపారు.

    ఎన్టీఆర్ అభిమానులను బాధించింది

    ఎన్టీఆర్ అభిమానులను బాధించింది

    యూట్యూబ్‌ల్లో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ జీవితంలోని నిజా నిజాలు మనకు ఎవరికీ తెలియదు. వారు మాట్లాడే తీరు చాలా డ్యామేజింగ్‌గా, ఇన్సల్టింగ్‌గా... ఎన్టీ రామారావుగారి అభిమానులందరినీ బాధించేలా ఉంది. మరో వైపు సినిమా కూడా బాగా నిరాశ పరిచింది.

    ఎన్టీఆర్-కథానాయకుడు అందుకే నిరాశ పరిచింది

    ఎన్టీఆర్-కథానాయకుడు అందుకే నిరాశ పరిచింది

    బయోపిక్ అంటే ఆయన జీవిత చరిత్ర తీయాలి. ఆయన జీవితంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చారు అని చూపించాలి. కానీ ‘ఎన్టీఆర్- కథానాయకుడు'లో సినిమాల్లోని క్లిప్పింగ్స్ మళ్లీ రీ షూట్ చేసినట్లు ఉంది. దాన్ని బయోపిక్ అనలేం. అందుకే సినిమా బాగా డిసప్పాయింట్ చేసింది. ఫస్టాఫ్ కొంత వరకు బావుంటుంది. సెకండాఫ్ మొత్తం ఎన్టీఆర్ పాత సినిమాల్లోని డైలాగులు, ఫైట్స్, సాంగ్స్ క్లిప్పింగ్స్ లాగా చూపించే ప్రయత్నం చేశారు.

    రామారావుగారి గౌరవాన్ని మంటగలిపినట్లు ఫీలవుతున్నాను

    రామారావుగారి గౌరవాన్ని మంటగలిపినట్లు ఫీలవుతున్నాను

    ఫిబ్రవరి 22న ‘ఎన్టీఆర్-మహానాయకుడు' వస్తుందట. అందులో ఏం చూపిస్తారో చూడాలి. ఆయన రాజకీయ జీవితంలో చాలా కథలు ఉన్నాయి. ఏ కథ తీసుకుంటారు? ఎంత వరకు తీసుకుంటారు? ఏది నిజం? ఏది అబద్దం? ప్రతి కథకు రెండు మూడు కోణాలుంటాయి. దాన్ని ఒక్కొక్కరు ఒక్కోరకంగా చెబుతారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అని మరొకటి చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ చేసి హడావుడి చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎంతో గౌరవంగా చూసుకునే రామారావుగారిని రోడ్డు మీదకు ఈడ్చినట్లు బాధగా ఉంది. అవి ఆడతాయా? లేదా? అనేది పక్కన పెడితే రామారావుగారి గౌరవాన్ని మంటగలిపినట్లు ఫీలవుతున్నాను.

    ‘యాత్ర' బయోపిక్ కాదు, అద్భుతంగా తీశారు

    ‘యాత్ర' బయోపిక్ కాదు, అద్భుతంగా తీశారు

    ‘యాత్ర' చూశాను. అది బయోపిక్ కాదు.. వైఎస్ఆర్ జీవితంలోని ఒక ఘట్టం. అద్భుతంగా తీశారు. చూస్తుంటే కళ్లెంట నీళ్లు వచ్చాయి. ఎవరి కథైనా... ఒక కథను సినిమాగా తీసినపుడు ప్రజలను స్పందింపచేయడం చాలా కష్టం. జరిగిన సంఘటనను తెరపై చూపిస్తూ కళ్లెంట నీళ్లు తెప్పించారంటే దర్శకుడికి హాట్సాఫ్ చెప్పాలి.

    పొలిటికల్ రీజన్ కోసం ఎక్స్‌టెండ్ చేసినట్లు అనిపించింది

    పొలిటికల్ రీజన్ కోసం ఎక్స్‌టెండ్ చేసినట్లు అనిపించింది

    అయితే యాత్ర మూవీ చివర్లో రాజశేఖర్ రెడ్డి ఒరిజినల్ విజువల్స్ ఆయన మరణం వరకు చూపించారు. అది చూశాక సినిమాను పొలిటికల్ రీజన్ కోసం ఎక్స్‌టెండ్ చేసినట్లు అనిపించింది. అది లేకుంటే సినిమా ఇంకా బావుండేదని దర్శకుడికి కూడా చెప్పాను.

    అద్బుతమైన సినిమాను మనమే చంపేశామా?

    అద్బుతమైన సినిమాను మనమే చంపేశామా?

    అందులో జగన్ గారిని చూపించడంతో పొలిటికల్ స్టంట్ అనే ఫీలింగ్ వచ్చింది. అద్బుతమైన సినిమాను మనమే చంపేశామా? అనే ఫీలింగ్ నాకు కలిగింది. నేను ఇలా అన్నానని ఎవరూ నన్ను తిట్టొద్దు. క్యూలోకి వెళ్లి డబ్బులు పెట్టి టిక్కెట్టు కొనుక్కుని చూశాను కాబట్టి నా అభిప్రాయం చెబుతున్నాను.

    సినిమా చూసి ఎవరూ ఓటు వేయరు

    సినిమా చూసి ఎవరూ ఓటు వేయరు

    ఎన్టీఆర్-కథానాయుడు, యాత్ర ఎన్నికలకు పనికి వస్తాయా? ఏ సినిమా కూడా ఎలక్షన్ కోసం పనికి వస్తుందని తీయడం పిచ్చితనం. సినిమా చూసి ఎవరూ ఓటు వేయరు. అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు సమయంలో ఆయన్ను బ్యాడ్ చేస్తూ ఎన్నో సినిమాలు వచ్చాయి. అవి ఏ ప్రభావం చూపలేదు. గెలిచేప్పుడు గెలిచారు... ఓడే సమయంలో ఓడారు. కేవలం సినిమా వల్ల గెలుస్తారు, సినిమా వల్ల ఓడుతారు అనుకోవడం కేవలం భ్రమ.

    వారిని నవ్వుల పాలు చేయొద్దు

    వారిని నవ్వుల పాలు చేయొద్దు

    బయోపిక్ అనే మాట చెప్పి బయోపిక్ పిక్ కాని ఫిక్సియస్ సినిమాలు తీసి వారి వారి క్యారెక్టర్లను చంపేయడం మంచిది కాదు. తీస్తే సిన్సియర్ గా తీద్దాం లేకుంటే వదిలేద్దాం...వారికి ఒక చరిష్మా ఉంది, గొప్పతనం ఉంది. ఆ గొప్పతనాన్ని ప్రజల మదిలో అలాగే ఉండేలా చేద్దాం. బయోపిక్ అని తీసి వారిని నవ్వుల పాలు చేయొద్దనేది నా ఆలోచన.

    English summary
    From Mahanati to Yatra: Tollywood’s era of BIOPICS says, Tollywood Veteran Director Tammareddy Bharadwaj. He says Is Biopics are the new craze of the TFI (Telugu Film Industry) with movies like Keerthi Suresh's Mahanati coming to light, the Tollywood industry suddenly got caught in a frenzied fire to mint biopics of all prominent figures till date. Do share your views in the comments section below.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X