చిరంజీవి ఇంట్లో మీటింగ్ జరిగితే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు.. వివాదంపై తమ్మారెడ్డి ఫైర్
గత రెండు మూడు రోజులుగా బాలకృష్ణ కామెంట్స్, నాగబాబు రివర్స్ కౌంటర్ ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే. సినీ పెద్దలందరూ ప్రభుత్వంతో చర్చించడంపై బాలకృష్ణ చేసిన కామెంట్స్ పెద్ద కుంపటిని రగిల్చాయి. భూములు పంచుకుంటున్నారు అని కామెంట్స్ చేయడంపై మెగా బ్రదర్ నాగబాబు ఫైర్ అయ్యాడు. ఈ వ్యవహారం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ విషయంపై సీ కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ వంటి వారు స్పందించారు. తాజాగా మరోసారి తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

బాలయ్య కామెంట్స్‌తో మొదలు...
సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాలు, షూటింగ్‌లు ప్రారంభం, థియేటర్ల పున: ప్రారంభంపై ఓ నిర్ణయం తీసుకునేందుకు సినీ పెద్దలంతా ప్రభుత్వంతో చర్చించారు. ప్రభుత్వం జరుపుతున్న చర్చలు, అలాగే ముఖ్యమంత్రులతో సినీ ప్రముఖులు సమావేశం అవుతున్న విషయం తనకు తెలియదని అన్నాడు. వారంతా భూములు పంచుకోవడానికి సమావేశం అవుతున్నారని కామెంట్స్ చేశాడు.

బాలయ్యపై నాగబాబు ఫైర్..
బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు అంత ఎత్తున లేచాడు. నోరు అదుపులో పెట్టుకోమని, మాటలు జాగ్రత్తగా రానీవ్వని హెచ్చరించాడు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కుదరదని తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. కింగ్‌వి కాదు, కేవలం ఒక హీరోవేనని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తమ్మారెడ్డి కామెంట్స్...
బాలకృష్ణ వ్యాఖ్యలపై తమ్మారెడ్డి స్పందిస్తూ.. పలానా వాళ్ళను పిలవాలి అనేది లేదు తనను కూడా పిలవలేదని చెప్పుకొచ్చాడు. దాన్ని ఇష్యూ చెయ్యాల్సిన పని లేదని, మహేష్ బాబు, వెంకటేష్ ఇలా చాలా మందిని పిలవలేదని చెప్పుకొచ్చాడు. మమ్మల్ని ఎందుకు పిలవలేదు అంటే అర్థం లేదని ఇది వరకే అన్నాడు. నేటి దాసరి మూడో వర్దంతి వేడుకలో పాల్గొన్న తమ్మారెడ్డి మరోసారి స్పందించాడు.
Recommended Video

ఎందుకు ఉలిక్కిపడుతున్నారు..
చిరంజీవి ఇంట్లో మీటింగ్ గురించి ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారనేది తనకు అర్థం కావడం లేదని తమ్మారెడ్డి పేర్కొన్నాడు. దాసరి ఉన్నపుడు ఈయన ఇంట్లో ఎన్నోసార్లు మీటింగ్స్ జరిగాయని, అప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు.. మరిప్పుడు ఎందుకు చిరంజీవి ఇంట్లో మీటింగ్ జరిగితే ఉలిక్కిపడుతున్నారనేది అర్థం కావడం లేదని అన్నాడు. బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరితోనూ మాట్లాడామని.. ఈ సమస్యకు అక్కడే పరిష్కారం దొరికిందని తాను అనుకుంటున్నట్లు తెలిపాడు.


Click it and Unblock the Notifications











