ప్రచారానికి వెళ్ళిన ఆర్టిస్టులకు జరగరానిది జరిగితే వారిపై ఆధారపడిన నిర్మాతల పరిస్ధితి ఏం కావాలని ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నిర్మాతల మండలి అధ్యక్ష్యుడు తమ్మారెడ్డి భరధ్వాజ ప్రశ్నించారు. అందుకోసం ఇటీవల టీడిపి ప్రచారానికి వెళ్ళి రోడ్డు ప్రమాదంలో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్ ఉదంతాన్ని ప్రస్ధావించారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేయటమే కాదు..అసలు పోటీ కూడా చేయకూడదన్నది తన అభిప్రాయమని ఆయన చెప్పారు. అయినా సినిమా వాళ్ళని రాజకీయ నాయకులు పావులుగా వాడుకుంటున్నారని, అవసరం తీరగానే కరివేపాకులా తీసి అవతల పారేస్తున్నారని భరద్వాజ చెప్పారపు. ఎవరు ఏ పార్టీ తరుపున ప్రచారం చేస్తున్నా సినీ పరిశ్రమ విషయానికి వస్తో అంతా ఒక్కటే. ఎన్నికల ప్రచారంలో ఒక సినీ ప్రముఖుడుపై మరొక నటుడు బురద జల్లుతూ ప్రచారం చేస్తే ప్రేక్షకుల ముందు చులకన అయిపోతాం..అయినా ఎన్నికల ప్రచారంలో ఒకరినొకరు తిట్టుకుంటే రేపు పరిశ్రమలో మొహమొహాలు చూసుకుంటూ పని చేయాలి అది గుర్తుపెట్టుకోవాలని తమ్మారెడ్డి పిలుపునిచ్చారు.