twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్లే ఇండస్ట్రీని చెడగొడుతున్నారు.. నిర్మాతలకు తమ్మారెడ్డి కౌంటర్

    |

    ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు తమ్మారెడ్డి భరద్వాజ్ ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడేతత్త్వం కలవారు. తాజాగా సైరా కలెక్షన్ల విషయంలో తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మెగా ఫ్యాన్స్ ఆయనపై ఫైర్ అవుతుండగా.. దానిపై తమ్మారెడ్డి వివరణ ఇచ్చి అంతటితో పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. తాజాగా తెలుగు సినీ పరిశ్రమ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

    యూట్యూబ్ చానెల్ ద్వారా అభిప్రాయాలు..

    యూట్యూబ్ చానెల్ ద్వారా అభిప్రాయాలు..

    సోషల్ మీడియా వాడకం పెరిగిన తరువాత ప్రతీ ఒక్కరూ తమ అభిప్రాయాలను స్వేచ్చగా ప్రపంచానికి చెబుతున్నారు. కూర్చున్న చోటే వారి భావాలను ఎందరితోనో పంచుకుంటున్నారు. యూట్యూబ్ చానెల్‌ను పెట్టి.. దాని ద్వారా తమ ఆలోచనలను బయటపెడుతున్నారు. తమ్మారెడ్డి కూడా ఓ యూట్యూబ్ చానెల్‌ను స్టార్ట్ చేసి నా ఆలోచన పేరిట వీడియోలను వదులుతున్న సంగతి తెలిసిందే.

    సైరా కలెక్షన్ల విషయంలో రగడ

    సైరా కలెక్షన్ల విషయంలో రగడ

    సైరా ఐదు వందల కోట్లు, వెయ్యి కోట్ల కలెక్ట్ చేస్తుందంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు తమ్మారెడ్డి. ప్రతీ విషయాన్ని కూలంకషంగా మాట్లాడే తమ్మారెడ్డి సైరా విషయంలో మాత్రం నిమిషం వ్యవధిలో సైరా గురించి మాట్లాడేశారు. మాట్లాడినంత సేపు కలెక్షన్ల విషయమే తప్పా ఇంకేమీ లేదు. దీంతో అభిమానులు ఫైర్ అయ్యారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ.. తానేమీ తప్పుగా మాట్లాడలేదంటూ వివరణ ఇచ్చుకున్నారు.

    కాకి లెక్కలు చెప్పిన తమ్మారెడ్డి..

    కాకి లెక్కలు చెప్పిన తమ్మారెడ్డి..

    రెండు రాష్ట్రాల్లో కలిపి పది కోట్ల మంది ప్రజలు.. అక్కడ ఇక్కడా కలిసి ఇంకో ఐదు కోట్లు మొత్తం పదిహేను కోట్ల మంది తెలుగు ప్రజలున్నారని ఓ అంచనా వేశారు. దీంట్లో సగం మంది సినిమాలు చూడరని అనుకుంటే.. కనీసం 8 కోట్ల మంది చూస్తారని చెప్పుకొచ్చారు. ఒక సినిమాను యావరేజ్‌గా ఐదు కోట్ల మంది చూస్తారు అనుకుంటే.. టికెట్ ధర వంద అనుకుంటే.. ప్రతీ సినిమాకు 500కోట్లు రావాలంటూ ఏవేవో కాకి లెక్కలు వేసి చెప్పారు.

    నిర్మాతలకు కౌంటర్...

    నిర్మాతలకు కౌంటర్...

    తాను చెప్పిన ఈ కాకి లెక్కలు వేసుకుని నిర్మాతలు వస్తున్నారని, రూపాయి ఇచ్చే హీరోకు వంద రూపాయల అడ్వాన్స్, ఐదు రూపాయల డైరెక్టర్‌కు 20 రూపాయలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. అలా వచ్చి ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా అంటే ఇష్టం, ప్యాషన్ ఉంటే రావాలని.. దీన్నే నమ్ముకుని వచ్చే వారిని ఇండస్ట్రీ ఆదరిస్తుందని చెప్పుకొచ్చాడు. అలా ఏవేవో కాకి లెక్కలు వేసుకుని రావొద్దని సూచించాడు.

    English summary
    Tammareddy Bhardwaj Counters On New Producers. He Slams Debut Producers. He Fires On Them That They Are Misleading Tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X