మీరు పతివ్రతలా.. డాష్ డాష్ లాగా మాటలు, రెండు పీకాలని ఉంది.. తమ్మారెడ్డి సంచలనం!
Recommended Video

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సినిమాపరమైన అంశాలు, సామాజిక రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు. ఇటీవల జరుగుతున్న ఘటనలపై ఆయన తనదైన శైలిలో విశ్లేషణలు అందిస్తున్నారు. ఇటీవల సినీనటి హరితేజ మహానటి చిత్రానికి థియేటర్ కు వెళ్లిన సందర్భంగా ఆమె కుటుంబం ఓ మహిళ నుంచి అవమానం ఎదుర్కొనవలసి వచ్చింది. ఈ విషయాన్నీ హరితేజ కన్నీరు పెట్టుకుంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం, హాట్ టాపిక్ గా మారడం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజగా తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు. సదరు మహిళని నిప్పులు చెరుగుతూ విమర్శలు గుప్పించారు.

మీరు పతివ్రతలా అని అడిగితే
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీని చాలా చులకనగా చూడడం ఎక్కువైపోతోంది అని తమ్మారెడ్డి అన్నారు. కొందరు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే కడుపు రగిలిపోతోంది, రెండు పీకాలని కూడా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హరితేజకు ఎదురైన అవమానం
ఇటీవల నటి హరితేజకు ఎదురైన అవమానం గురించి తెలుసుకుని తాను ప్రస్తుతం మాట్లాడుతున్నానని తమ్మారెడ్డి అన్నారు. అందరిలాగే హరితేజ ఫ్యామిలీ టికెట్టు కొనుక్కుని సినిమాకు వెళితే అవమానించడం ఏంటని మండిపడ్డారు. సినిమా మగోళ్ల పక్కన మా పిల్లలు కూర్చోరు అని మాట్లాడడం ఎంత దారుణం అని తమ్మారెడ్డి అన్నారు.

మంచి వారేనా అని అడిగి
బస్సులో, రైల్లో, విమానాల్లో ప్రయాణించే సమయంలో మీరు మంచి వారేనా అని అడిగి కూర్చుంటారా. ఆ సంధర్భంలో మీ పక్కన కూర్చున్న వారంతా మంచి వారే అని గ్యారెంటీ ఇవ్వగలరా. అసలు ముందు మీరెలాంటి వారు అని మేము అడిగామా అంటూ ప్రశ్నలు సంధించారు.

సర్టిఫికేట్ తీసుకుని రండి
హరితేజ సినిమా సెలెబ్రిటీ కాబట్టి గుర్తు పట్టి మరి ఆ మాట అన్నారు. సినిమా వాళ్లంతా చెడ్డవాళ్ళు అనే ముద్ర, సర్టిఫికెట్ ఇచ్చేశారు. మీరు మంచి వారా కాదా అనే సర్టిఫికెట్ ఎవరు ఇస్తారు. ఈ సారి థియేటర్ కు వచ్చేముందు సర్టిఫికెట్ తీసుకుని వచ్చి మా పక్కన కూర్చోండి.

ఎవరి పక్కనైనా కూర్చుంటారు
ఇటీవల హరితేజ తన కుటుంబంతో పాటు మహానటి సినిమా చూడడానికి థియేటర్ కు వెళ్ళింది. హరితేజ తండ్రి కూడా ఉన్నారు. మీ తండ్రి పక్కన మా పిల్లలు కూర్చోరు. మీరు సినిమావాళ్లు, ఎవరి పక్కనైనా కూర్చుంటారు అంటూ ఓ మహిళా హరితేజ కుటుంబాన్ని అవమానించింది.

అందరిలాగే సినిమావాళ్లు
సినిమాలు కూడా అందరి లాంటి మనుషులే అని తమ్మారెడ్డి అన్నారు. కాకపోతే మేము ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామని అన్నారు. సమాజంలో చెడ్డవారు ఉన్నట్లే సినిమా ఇండస్ట్రీలో కూడా కొంత మంది చెడ్డవారు ఉండే అవకాశం ఉందని అన్నారు. అంత మాత్రానికే అవమానంగా మాట్లాడుతారా అంటూ ప్రశ్నించారు.

డాష్ డాష్ లాగా మాట్లాడుతున్నారు
ఒకరినొకరు గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. మేము మిమ్మల్ని ప్రేక్షక దేవుళ్ళు అని పిలుస్తాం. మీరు మాత్రం మమ్మల్ని డాష్ డాష్ లాగా మాట్లాడుతున్నారు అని తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications











