మీడియాకు తమ్మారెడ్డి కౌంటర్.. ఎవరు పడితే వాళ్ళని, పవన్ కళ్యాణ్ చెప్పారని కాదు!
Recommended Video

దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మీడియాపై ఫైర్ అయ్యారు. ఇటీవల ఇండస్ట్రీలో జరుగుతున్న ఘటనల గురించి ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మీడియాపై యుద్ధం ప్రకటించిన తరువాత పరిణామాలు వేగంగా మరాయి. కొన్ని మీడియా సంస్థలని బ్యాన్ చేయడానికి కుడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అదంతా అపోహ మాత్రమే అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఇండస్ట్రీ, మీడియా పాలు నీళ్ళ లాంటివని అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా మీడియా అపోహలకు పోవడం కరెక్ట్ కాదని అన్నారు. మెగా ఫ్యామిలి ఇండస్ట్రీని నియంత్రించడానికి ప్రయత్నిస్తోందంటూ వస్తున్న కథనాల గురించి కుడా ఆయన స్పందించారు.

ఇండస్ట్రీకి కష్టం వచ్చింది
చిత్ర పరిశ్రమ గురించి మీడియాలో అపోహలు పెరుగుతున్నాయని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఇటీవల ఇండస్ట్రీలో అనుకోని పరిణామాలు చేసుకున్నాయని అందువలనే ఇండస్ట్రీలోని ప్రముఖులంతా చిరంజీవి నేతృత్వం వహించిన సమావేశానికి హాజరయ్యారని అన్నారు. మీడియాని బ్యాన్ చేయడానికే ఈ సమావేశాలు అంటూ వస్తున్న ఊహాగానాల ఆధారంగా అపోహలకు పోవడం కరెక్ట్ కాదని అన్నారు.

పవన్ కళ్యాణ్ చెప్పారని కాదు
ఇండస్ట్రీ సమస్యని తీర్చడానికి అందరికి ఒక సమయంలో ఆసక్తి వస్తుంది. అందుకే అంతా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ చెప్పారనో, చిరంజీవి సమావేశం నిర్వహించారనో కాని తమ్మారెడ్డి అన్నారు. ఇందులో మీడియాని బ్యాన్ చేసే ఉద్దేశం లేదని అన్నారు.

మెగా ఫ్యామిలీ గురించి వస్తున్న వార్తలపై
ఇండస్ట్రీని నియంత్రించడానికి మెగా ఫ్యామిలీ ప్రయత్నిస్తోందంటూ వస్తున్న వార్తల గురించి తమ్మారెడ్డి మాట్లాడారు. ఇండస్ట్రీలో ఫ్యామిలీలు ఉన్నాయి. కాని ఫ్యామిలీలకు ఇండస్ట్రీ లేదని అన్నారు. ఇండస్ట్రీని ఏ ఒక్క ఫ్యామిలీయో నియంత్రించలేదని అన్నారు.

ఎవరు పడితే వాళ్ళని
మీడియా ఈ మధ్య కాలంలో చేస్తున్న తప్పుల గురించి కుడా తమ్మారెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఎవరు పడితే వాళ్ళని టివి చానల్స్ లో కూర్చోబెట్టడం, సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానలని వార్తలుగా వేయడం సరైనదేనా అంటూ ప్రశ్నించారు.

మీకు కూడా జరుగుతోంది
మమ్మల్ని ట్రోలింగ్ చేస్తుంటే మీరు వేసుకుంటున్నారు.. ఇప్పుడు మిమ్మల్ని కుడా ట్రోల్ చేస్తున్నారు చోసుకోండి అంటూ మీడియా కు తమ్మారెడ్డి చురకలంటించారు. పవన్ కళ్యాణ్ కొన్ని మీడియా సంస్థలని దుమ్మెత్తి పోసిన సంగతి తెల్సిందే. అప్పటి నుంచి నెటిజన్లు సోషల్ మీడియా వేదిక కొన్ని టివి చానల్స్ భరతం పడుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











