చిరంజీవి సగం కోపాన్నే చూశారు..మొత్తం చూస్తే ఇక అంతే.. తమ్మారెడ్డి కామెంట్స్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డైరీ 2020 ఆవిష్కరణ వేడుక ఎంత రసాభాసాగా జరిగిందో అందరికీ తెలిసిందే. మంచి ఉంటే మైకులో చెబుదాం.. చెడు ఉంటే చెవిలో చెబుదామని మెగాస్టార్ చిరంజీవి అందరికీ సూచించిన మరుక్షణమే.. రాజ శేఖర్ వచ్చి తుస్సుమనిపించాడు. మా లోని కుమ్ములాటలు, వర్గపోరు గురించి అందరి ముందు లేవనెత్తి, సభా మర్యాదను కూడా పాటించకుండా నానా రచ్చ చేసి వెళ్లిపోయాడు. ఇక రాజ శేఖర్ రేపిన ఈ చిచ్చు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు లేవనెత్తింది.

చిరు ప్రసంగంతో మొదలు..

చిరు ప్రసంగంతో మొదలు..

భార్యాభర్తలకే గొడవలు జరుగుతుంటాయి.. అలా అని అవి బయట పెట్టుకుంటామా? తాను, తన భార్య కూడా రోజూ తిట్టుకుంటామని కొట్టుకుంటామని సరదాగా ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. మా గురించి మంచి ఉంటే మైకులో చెప్పుకుందాం.. చెడు ఉంటే చెవిలో చెప్పుకుందామని సభ్యులందరికీ సూచించాడు. చిరు ప్రసంగాన్ని రాజ శేఖర్ వ్యతిరేకించినా.. మిగతా సినీ పెద్దలందరూ కొనియాడారు.

 నొక్కేస్తున్నారంటూ రాజశేఖర్ రచ్చ..

నొక్కేస్తున్నారంటూ రాజశేఖర్ రచ్చ..

నిప్పును కప్పి ఉంచితే.. పొగ రాకుండా ఉండదు అని చిరు ప్రసంగానికి సెటైర్ వేశాడు రాజశేఖర్. సినిమాల్లో హీరోలుగా చేస్తున్నాం..బయట హీరోలా మంచి పనులు చేద్దామంటే తొక్కేస్తున్నారు.. నొక్కేస్తున్నారంటూ అందరిపై ఫైర్ అయ్యాడు. మోహన్ బాబుపై కూడా అరిచి సభలోంచి వెళ్లిపోయాడు. అనంతరం తన ఉపాధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశాడు.

రాజశేఖర్ తీరుపై అసహనం..

రాజశేఖర్ తీరుపై అసహనం..

మా డైరీ వేడుకలో రాజ శేఖర్ తీరుపై సినీ పెద్దలు ఫైర్ అయ్యారు. మోహన్ బాబు, కృష్ణం రాజు, మురళీ మోహన్ ఇలా ప్రతీ ఒక్కరూ రాజ శేఖర్‌పై అసహనం వ్యక్తం చేశారు. క్రమశిక్షణా కమిటీ అనేది ఉంటే రాజశేఖర్‌పై స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలని చిరంజీవి ఆదేశించాడు. కో ఆర్డినేషన్ కమిటీని వెంటనే ఏర్పాటు చేస్తున్నానని, ఇలా బహిరంగంగా మాట్లాడేవారిని కఠినంగా శిక్షించాలని కృష్ణంరాజు అన్నాడు.

పూర్తి కోపం వస్తే చూడాలి..

పూర్తి కోపం వస్తే చూడాలి..

ఈ ఉదంతంపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. మొగుడు పెళ్లాలన్నాక గొడవలు సహజమని చిరంజీవి చెప్పారు కదా చెడు ఉంటే చెవిలో చెప్పాలని పేర్కొన్నారు. ఈ గొడవ అనుకోకుండా అందరి ముందు, మీడియా ముందు జరిగింది కాబట్టి పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నట్లు తెలిపాడు. వీటన్నంటికి మూల కారణం పదవులు, వాటిలో ఉండే పవర్, ఆదిపత్య పోరు గురించేనని స్పష్టం చేశాడు. గొడ‌వ ఎవ‌రు, ఎందుకు చేశారు? అని ఆలోచించ‌కుండా ప‌రిష్కారం ఆలోచించాల‌ని ఆయ‌న అన్నాడు. చిరంజీవి సగం కోపమే అందరం చూశాము.. పూర్తిగా కోపం వస్తే ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. చిరుకు పూర్తిగా కోపం రావాలని కోరుకుంటున్నానని అన్నాడు. అప్పట్లో దాసరి గారు అన్ని సమస్యలను పరిష్కరించారని, అయితే ఇప్పుడు చిరుకు మాత్రమే ఆ సత్తా ఉందని తమ్మారెడ్డి అన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X