twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్, అలీ ఇష్యూ.. నన్ను గోడమీద పిల్లి అన్నారు.. సొంత మనుషుల నుంచే విమర్శలు!

    |

    ఏప్రిల్ 11తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి ముగిసింది. ఇక ఎన్నికల ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారం చివర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన స్నేహితుడు కమెడియన్ అలీ గురించి చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా అలీ కూడా విమర్శించారు. అప్పటి వరకు మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరి మధ్య ఇంతలా మనస్పర్థలు ఎందుకు చోటు చేసుకున్నాయనే చర్చ అందరిలో జరిగింది. ఈ వ్యవహారంపై సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి మరో మారు స్పందించారు.

     అలీని ప్రశ్నిస్తూ

    అలీని ప్రశ్నిస్తూ

    పవన్ కళ్యాణ్ ఆ మధ్యన రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభలో అలీని ఉద్దేశిస్తూ.. తాను అలీ బంధువులకు జనసేన పార్టీ టికెట్ ఇచ్చానని పవన్ అన్నారు. కానీ అలీ మాత్రం వెళ్లి వైసిపి తరుపున ప్రచారం చేస్తున్నారని..స్నేహమంటే ఇదేనా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అలీ తనపై నమ్మకం లేక వైసిపిలో చేరారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి.

    అలీ కూడా ఘాటుగా

    అలీ కూడా ఘాటుగా

    తాను కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని అని, మీరు మాత్రం చిరంజీవి గారు వేసిన బాటలో వచ్చారని అలీ పవన్ ని విమర్శించారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నానని అన్నారు. మీరు ఎప్పుడు నాకు సాయం చేశారని అలీ ప్రశ్నించాడు. దీనితో అలీ, పవన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ గోడపై సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన స్పందనపై విమర్శలు ఎదురవుతున్నాయని తమ్మారెడ్డి తాజాగా స్పందించారు.

     గోడమీద పిల్లి అంటూ

    గోడమీద పిల్లి అంటూ

    నా సొంత మందుషులే పవన్ కళ్యాణ్, అలీ గొడవ గురించి నేను చేసిన వ్యాఖ్యలని తప్పుబడుతున్నారని తమ్మారెడ్డి అన్నారు. ఎందుకు మీరు గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారు. ఒకరివైపు ఉండి ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నిస్తున్నట్లు తమ్మారెడ్డి తెలిపారు. అలీ, పవన్ తమ గొడవని మీడియా దాకా తెచ్చుకోవడం కరెక్ట్ కాదు. కానీ మీరు వారిద్దరి సమస్య గురించి మాట్లాడుతోంది సోషల్ మీడియాలోనే కదా అని తనని ప్రశ్నిస్తున్నట్లు తమ్మారెడ్డి తెలిపారు.

    పవన్‌తో ఫోన్‌లో మాట్లాడొచ్చు కదా

    పవన్‌తో ఫోన్‌లో మాట్లాడొచ్చు కదా

    కొంతమంది ఈ విషయం గురించి పవన్, అలీతో ఫోన్ లో వ్యక్తిగతంగా మాట్లాడి ఉండొచ్చు కదా అని అడుగుతున్నారు. ఆ సమయంలో వారిద్దరూ ఎన్నికల హడావిడిలో ఉన్నారని, తాను ప్రయత్నించినా వారు దొరకరని తమ్మారెడ్డి అన్నారు. అందరూ పూర్తిగా మంచి వాళ్లు కాదు.. అలాగని పూర్తిగా చెడ్డవాళ్ళు కూడా కాదు. అందుకే నేను ఒకరికే సపోర్ట్ చేయకూడదు అని అనుకుంటా. అందరి నాయకుల్లోని, పార్టీలోని తప్పులని ఎత్తిచూపుతున్నానని తమ్మారెడ్డి అన్నారు. అలీ, పవన్ విషయంలో కూడా అందుకే ఇద్దరివైపున ఉండి మాట్లాడుతున్నానని అన్నారు. అది కొంతమందికి గోడ మీద పిల్లిలాగా అనిపించవచ్చు.

    English summary
    Tammareddy Bharadwaj once again Responds on Pawan Kalyan,Ali Controversy. He gives answers to all who trolling him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X