చిరంజీవికి, నాకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత.. కానీ, బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో తమ్మారెడ్డి!

టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలు చేసారు. ఆదివారం రోజు సన్నిహితుల మధ్య జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. తానెప్పుడూ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోలేదని, సన్నిహితులు కోరికమేరకే వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమపై తన వైఖరి వివరించారు. తాను అందరిపట్ల ఎందుకు కఠినంగా మాట్లాడుతానో కూడా తెలిపారు. తన వయసు పుట్టినరోజు వేడుకలు జరుపుకునే వయసు కాదని అన్నారు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వలనే తాను పుట్టినరోజు వేడుకలు చేసుకున్నానాని తమ్మారెడ్డి తెలిపారు.

 విషాద ఘటన మరచిపోవడానికి

విషాద ఘటన మరచిపోవడానికి

ఏడాది క్రితం తమ ఇంట్లో జరిగిన విషాద ఘటన మరచిపోవడానికి తాను అందరితో కలివిడిగా మెలుగుతున్నాని తమ్మారెడ్డి అన్నారు. తాను బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కూడా కారణం ఇదే అని అన్నారు.

Recommended Video

Ram Charan Spends 40 Cr For 1 Scene In Sye Raa
చాలా మంది స్నేహితులు

చాలా మంది స్నేహితులు

తనకు సినీ రాజకీయాల్లో చాలా మంది స్నేహితులు ఉన్నారని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. వారి బాగు కోరే వ్యక్తిగా వారితో కొన్ని సార్లు తాను కఠినంగా మాట్లాడుతుంటానని అన్నారు. ఆ క్రమంలోనే కొందరితో విభేదాలు తలెత్తాయని తమ్మారెడ్డి అన్నారు.

చిరుతో పచ్చగడ్డి వేస్తే

చిరుతో పచ్చగడ్డి వేస్తే

తనకు, చిరంజీవికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విభదాలు ఉన్నాయని అంతా అనుకుంటారు. కానీ ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా మొట్టమొదట ఫోన్ చేసిన వ్యక్తి చిరంజీవి అని తమ్మారెడ్డి తెలిపారు. ఫోన్ చేసి మరీ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారని అన్నారు.

అందువలనే

అందువలనే

తాను ప్రేమతోనే ఎవరికైనా సలహాలు, సూచనలు ఇస్తానని తమ్మారెడ్డి అన్నారు. ఆ క్రమంలోనే కొంచెం కఠినంగా మాట్లాడుతానని తమ్మారెడ్డి తెలిపారు.

8 సార్లు తిండిలేక

8 సార్లు తిండిలేక

తన సినీ జీవితంలో 8 సార్లు తిండికి లేని పరిస్థితి ఎదురైందని తమ్మారెడ్డి అన్నారు. ఆ సమయంలో చిత్ర పరిశ్రమకు చెందిన వారే ఆదుకున్నారని తమ్మారెడ్డి తెలిపారు. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ మూడు నెలల పాటు తనకు మూడు పూట్లా భోజనం తీసుకుని వచ్చి పెట్టేవాడని గుర్తు చేసుకున్నారు.

కృష్ణ, దాసరితో

కృష్ణ, దాసరితో

తనకు కృష్ణతో, మా గురువు దాసరి నారాయణరావుతో కూడా విభేదాలు తలెత్తాయని అన్నారు. తాను ఎప్పటికి సినీ పరిశ్రమతోనే ఉంటానని తమ్మారెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X