twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవికి చెడు చేస్తున్నట్టే.. వైఎస్ జగన్‌తో సినీ పెద్దల మీటింగ్‌పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్

    |

    ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో త్వరలో చిరంజీవి ఆధ్వర్యంలోని సినీ ప్రముఖుల బృందం కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో టికెట్ రేట్ల విషయం సహా అనేక విషయాల మీద ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు

     అదే ప్రధాన సమస్య

    అదే ప్రధాన సమస్య

    తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘మీడియాలో ప్రభుత్వంతో సినిమా వారి మీటింగ్ అంటూ వార్తలు వస్తున్నాయి.. సినీ పరిశ్రమ సమస్యల మీద ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయి. చిరంజీవి రేపు జగన్ గారి ని కలిసేందుకు వెళుతున్నారు. నేరుగా కలిస్తేనే సమస్యల తీవ్రత తెలుస్తుంది. ప్రైవేట్ ఆన్ లైన్ టికెటింగ్ ప్రధాన సమస్య అని అన్నారు.
    ప్రభుత్వం, ఛాంబర్ కలిసి ఆన్లైన్ వ్యవస్థ పెట్టాలన్నది మా ఆలోచన అని పేర్కొన్న ఆయన క్యూబ్ సిస్టమ్ వల్ల కూడా సమస్యలున్నాయని అన్నారు. దాని వలన నిర్మాతలకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.

    ఎవరు వెళ్లి మాట్లాడినా అదేగా

    ఎవరు వెళ్లి మాట్లాడినా అదేగా

    టికెట్ రేట్లు తెలంగాణలో పెంచారు, తగ్గించటం లేదు. దాని వల్ల ఇక్కడ సినిమాలను చూడటం తగ్గించారని అన్నారు. ఆంధ్రాలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల ఎక్కువగా చూశారు. నిజానికి అఖండ, పుష్ప పెద్ద హిట్స్. 'పుష్ప'కు థియేటర్‌ల సంఖ్య ఎక్కువ వల్ల వసూళ్లు వచ్చాయి. 'అఖండ , పుష్ప' సినిమాలను ఆంధ్రాలో బాగా ఆదరించారని ఆయన అన్నారు. సీఎంతో చిరంజీవి సమావేశం గురించి స్పందిస్తూ.. ఎవరు వెళ్లి మాట్లాడినా సినీ పరిశ్రమ సమస్యలపైనే అని స్పష్టం చేశారు. కొందరిని ప్రభుత్వం పిలవనప్పుడు అడుక్కుని పిలిపించుకోవడం అన్నది సరికాదని అన్నారు.

    చెడు చేస్తున్నట్టే

    చెడు చేస్తున్నట్టే

    చిరును ప్రభుత్వం గుర్తించిందని.. సంతోషం వ్యక్తం చేశారు. చిరంజీవి తమ నాయకుడే అని కూడా తేల్చి చెప్పారు. అయితే చిరంజీవిని ఒక్కరినే ఎందుకు పిలిచారో తెలియదన్న ఆయన ప్రభుత్వాలు గుర్తించిన అసోషియేషన్లతో మాట్లాడాలని అన్నారు. చిరంజీవిని పిలిచారు కాబట్టే వెళ్లారు కానీ బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్నవారిని పిలవాల్సిన అవసరం ఉందన్నారు. చిరంజీవి ఒక్కరినే పిలిస్తే.. ఆయన అందరిని తీసుకొస్తానని చెప్పలేరు కదా అని తమ్మారెడ్డి ప్రశ్నించారు. ఒక రకంగా ప్రభుత్వం చిరంజీవికి చెడు చేస్తున్నట్టే' అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

    స్పష్టత రావాల్సి

    స్పష్టత రావాల్సి

    ఇక ఆన్ లైన్ టికెటింగ్ విధానమంటూ వస్తే.. దోపిడీ కూడా అడ్డగోలుగా పెరుగుతుందని తమ్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తో కలిపి ఈ విధానాన్ని అమలు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. మరోవైపు.. చిన్న సినిమాలకు థియేటర్లలో ఐదో షో ద్వారా అవకాశం కల్పించాలని కూడా ఆయన కోరారు. ఇక నంది అవార్డుల ప్రదానోత్సవం పైన కూడా తెలుగు రాష్ట్రాల నుంచి సరైన స్పష్టత రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

     రిప్రజెంటేషన్ ఇచ్చా

    రిప్రజెంటేషన్ ఇచ్చా

    ఇక ఆంధ్రాలో లొకేషన్ చార్జీలు తీసుకోవడం లేదని.. తెలంగాణలోనూ ఈ విధానాన్ని అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు.రెమ్యునరేషన్స్ గురించి మాట్లాడుతూ నటీనటులు, టెక్నీషియన్స్.. కొన్ని లగ్జరీలను వదిలేయాలని కోరారు. అయితే కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు కానీ.. కొన్నింటిని వదిలేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలపై గతంలో కూడా రిప్రజెంటేషన్ ఇచ్చామని.. ఇప్పుడు మీడియాకు చెబుతున్నానని ఆయన అన్నారు.

    Recommended Video

    AP Movie Tickets Rates బలుపు వైసీపీ ఎమ్మెల్యేలదా? సినిమా వాళ్లదా? | Filmibeat Telugu
    రెవెన్యూ పెరిగే అవకాశం

    రెవెన్యూ పెరిగే అవకాశం


    ఇక తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మినీ థియేటర్లను ప్రోత్సహించాలని, అప్పట్లో.. ఏపీలో నాలుగు థియేటర్లని ప్రారంభించారు కానీ అధిక సంఖ్యలో తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదని అన్నారు. అవి ఉన్నట్లైతే ఇప్పుడు థియేటర్ల కొరత పోయేదని అన్నారు. ఇక అవే కనుక ఉంటే చిన్న, పెద్ద సినిమా అని తేడా లేకుండా రెవెన్యూ పెరిగే అవకాశం ఉండేదన్నారు. సినీ కార్మికులకి పెద్దగా రెవెన్యూ లేదు. అయినా బిల్లింగ్‌ పేరు చెప్పి జీఎస్టీ కోతలు వేస్తున్నారు. దానికి బదులుగా ఇఎస్‌ఐ, పీఎఫ్‌ వచ్చేలా చేస్తే బాగుంటుందని అన్నారు.

    English summary
    Director-producer Tammareddy Bhardwaj held a media conference and made key remarks in the backdrop of a keynote meeting of a group of cine celebrities led by Chiranjeevi with AP CM YS Jagan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X