బిగ్ బాస్ వివాదాన్ని ఇంకెంత కాలం సాగదీస్తారు?

బిగ్ బాస్ సెలక్షన్ విషయంలో కో ఆర్డినేటర్లు తమతో అభ్యంతరకరంగా ప్రవర్తించారంటూ జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయిత్రి గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. దీన్ని ఇంకెంతకాలం సాగదీస్తారని ప్రశ్నించారు. క్యాష్ కమిటీ లాంటివి ఉన్నా ఎందుకు వారికి త్వరితగతిన న్యాయం జరుగడం లేదని ప్రశ్నించారు.

ఇలాంటిది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో జరిగితే మమ్మల్ని బ్రతకనిచ్చేవారు కాదేమో... రోజూ మాపై వార్తలు రాసి రాసి నరకం చూపించేవారు. కానీ ఇక్కడ ఇంత గొడవ జరుగుతోంది... ఇద్దరు అమ్మాయి పోలీసులకు, క్యాష్ కమిటీకి కంప్లయింట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ వేగంగా జరుగడం లేదని తెలిసినా ఎవరూ మాట్లాడటం లేదు. అదే సినిమా ఇండస్ట్రీలో ఏదైనా జరిగితే దాని గురించి అల్లకల్లోలం చేసేవారు, దారుణంగా రాసేవారని తమ్మారెడ్డి అన్నారు.

Tammareddy Bharadwaj Questions Over Bigg Boss 3 Controversies

సినిమా ఇండస్ట్రీలో అయినా, మీడియాలో అయినా, ఐటీ ఇండస్ట్రీలో అయినా ఆడవారికి జరిగే అన్యాయాలు, మోసాలను పరిష్కరించేందుకు కమిటీ ఉండాలి. విశాఖ గైడ్ లైన్స్ కానీ, క్యాష్ కమిటీకానీ ఉండాలి. ఉన్న కమిటీలతో ఏం చేయాలి అనేదానిపై ఇప్పటి వరకు మనకు పూర్తి అవగాహన లేదు. సినిమా వాళ్లం కాబట్టి మాకు పూర్తి తెలియదు అని అనుకుంటున్నాం. ఇంత పెద్ద కార్పొరేట్ సంస్థలో కూడా ఇలాగే ఉంది అంటే... వాళ్ల కంటే మేము బెటర్‌గా చేస్తున్నామనే అర్థం... అని పేర్కొన్నారు.

క్యాష్ కమిటీల్లాంటివి వేసేది ఇన్‌స్టంట్ జస్టిస్ జరుగాలనే. అక్కడ కూడా లేటవుతుంటే ఎలా? తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు ఏదో ఒకటి చేప్పాలి. అంతే కానీ దాన్ని ఎంత కాలం సాగదీస్తారు? ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదు. అలా సాగదీస్తుంటే ఊరుకునేవారు ఎందుకు ఊరుకుంటున్నారో కూడా తెలియడం లేదు అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X