Adipurush అసలు ప్రాబ్లం ఇదే.. ట్రోలింగ్ పై కూడా అసలు కారణం చెప్పిన తమ్మారెడ్డి

ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆదిపురుష్ సినిమా 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా ఊహించిన విధంగా మొదట కొంత నెగిటివ్ టాక్ అందుకుంది. ఆ తర్వాత థియేటర్లో 3D టీజర్ చూసిన తర్వాత ఓవర్గం ప్రేక్షకులు మాత్రం తప్పకుండా ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై త్రీడీలోనే చూడలేని అప్పుడే చాలా బాగుంటుంది అని కూడా అన్నారు.

అయితే ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ పై కొంతమంది సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ కూడా తనదైన శైలిలో ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ఇటీవల విడుదలైన ఆదిపురుష్ టీజర్ చూడడం జరిగింది. ప్రభాస్ సినిమా రామాయణం బ్యాక్ గ్రౌండ్ అనగానే తప్పకుండా వాడి వేడిగా ఉంటుంది అనుకున్నారు. అలాగే 500 కోట్ల ప్రాజెక్ట్ ముంబైలోనే గ్రాఫిక్స్ జరుగుతున్నాయి కాబట్టి అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

Tammareddy bharadwaj reaction on adipurush movie teaser trolling

కానీ టీజర్ చూసిన తర్వాత కాస్త నిరుత్సాహంగా అనిపించింది. అందుకే ట్రోలింగ్ కూడా నడిచింది. చిత్ర యూనిట్ సభ్యులందరూ కూడా ఈ సినిమాను త్రీడీలో చూడాలని అంటున్నారు. అయితే ఏదైనా సరే త్రీడీ అయినా 4D లో అయినా లైవ్ కి అనేది కొంత తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో త్రీడీలో పక్షులను రాక్షసులు మీదకు వచ్చినట్లు అనిపిస్తుంది. అసలు సమస్య ఏమిటి అంటే ఇది ఒక యానిమేషన్ సినిమా లాగా ఉంది అని గతంలో వచ్చిన రజినీకాంత్ కొచ్చాడియన్ సినిమా లాగా కూడా ఉంది అని అంటున్నారు.

అలాగే రాముడు, రావణాసురుడు, హనుమంతుడు గెటప్పుల మీద కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. రాముడిని దేవుడు లాగా కొలిచే ఈ దేశంలో ఆయన గెటప్ ను కొంత మార్చడం కూడా విచిత్రంగానే ఉంది. రావణాసురుడు కూడా ఒక బ్రాహ్మణుడిగా గుర్తింపు అందుకున్నాడు. అతనికి కూడా చాలా దేవాలయాలు ఉన్నాయి. అలాంటిది ఈ రోజుల్లో అంతా మారిపోవడం ఏమిటని అంటున్నారు. నిజానికి రిపేర్లు చక్కగా చేస్తే మంచిదే. ఏదైనా సరే సినిమా బాగా ఉండాలి అని ట్రోల్ చేస్తున్నారు అనిపిస్తుంది. అల్లరి చేయాలని కూడా పెద్దగా ఎవరూ అనుకోవడం లేదు. ఏదేమైనా సినిమా విడుదల తర్వాత ఆకట్టుకోవాలి అని కోరుకుందాం.. అని అంటూ ఆ సినిమాకి తమ్మారెడ్డి భరద్వాజ్ ఆల్ ది బెస్ట్ అని తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X